అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి యువరాజ్ సింగ్... రిటైర్మెంట్ తర్వాత కొత్త కొత్తగా ట్రై చేస్తూ...

First Published | Mar 27, 2021, 12:32 PM IST

టీమిండియాలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ భామలతో డేటింగ్ చేసి మంచి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్. ఇప్పుడు క్రికెట్‌కి వీడ్కోలు పలికిన తర్వాత సరికొత్త హెయిర్ స్టైల్‌, న్యూ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు యువీ...

సచిన్ టెండూల్కర్ సారథ్యంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న యువరాజ్ సింగ్, వరుస సిక్సర్లు బాది తనలోని బ్యాట్స్‌మెన్ ఇంకా చావలేదని నిరూపించాడు... ఇండియా లెజెండ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభానికి ముందే న్యూ లుక్‌లో కనిపించాడు యువరాజ్. ఫ్రెంచ్ కట్‌లాంటి సగం గడ్డంతో జుంపాల జుట్టతో కనిపించాడు...

అయితే సిరీస్ ముగిసేసరికి ఫిట్‌నెస్‌పైన కూడా ఫోకస్ పెట్టిన యువరాజ్ సింగ్... ఇప్పుడు ట్రెండీ హెయిర్ కట్, అండ్ బియర్డ్‌తో స్టైలిష్ ఐకాన్‌లా కనిపిస్తున్నాడు...
యువరాజ్ సింగ్ న్యూలుక్‌పై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అందరూ ఫిదా అయిపోయారు... ‘యువీ భాయ్.. బాద్‌షా లా మారిపోయావ్’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్...
రవీంద్ర జడేజా మాత్రం ‘ఏమైంది యువీ భయ్యా’... అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇర్ఫాన్ పఠాన్... ‘లుక్ అదిరింది భయ్యా’ అంటూ కామెంట్ చేశాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న గోనీ ‘కిల్లర్ లుక్’ అంటూ కామెంట్ చేయగా... యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ అందరూ ‘కింగ్’ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు...
రక్తపు వాంతులు అవుతున్నా అలాగే బ్యాటింగ్ కొనసాగించి, క్రికెట్‌పై తనకున్న అంకితభావాన్ని చాటుకున్న యువరాజ్ సింగ్... 304 వన్డేల్లో 8701 పరుగులు చేశాడు...
2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు...
క్యాన్సర్‌తో పోరాడి గెలిచినా... భారత జట్టులో చోటు కోసం ఎదురుచూసి 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు యువీ. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువరాజ్ భావించినా, అతను విదేశీ లీగుల్లో పాల్గొనడంతో బీసీసీఐ యువీ అభ్యర్థనను తిరస్కరించింది.

Latest Videos

click me!