ధోనీలో నాకు నచ్చేది ఇదే, చెన్నైకి ఎంపికైన తర్వాత నాకు ఫోన్ చేసి... - రాబిన్ ఊతప్ప

First Published Mar 27, 2021, 11:39 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులో రాణించిన ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. అయితే ఫామ్ కోల్పోయి టీమ్‌కి దూరమైన రాబిన్ ఊతప్ప, 14 సీజన్లుగా ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు. 2021సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడబోతున్నాడు రాబిన్ ఊతప్ప...

గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన రాబిన్ ఊతప్పను ట్రేడింగ్ ద్వారా రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... ధోనీ సారథ్యంలో సీఎస్‌కేకి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాడట రాబిన్ ఊతప్ప...
undefined
‘సీఎస్‌కేకి ఎంపికైన తర్వాత ధోనీ నాకు ఫోన్ చేశాడు, నన్ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తనది కాదని చెప్పాడు... ‘‘నువ్వు చెన్నైకి ఆడాలని నేను నిర్ణయం తీసుకోలేదు...
undefined
మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ గ్రూప్, కోచ్, సీఈఓలు కలిసి తీసుకున్న నిర్ణయం.. నా వల్లే నువ్వు చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చావని అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు..
undefined
నీ సొంత కష్టంతో టాలెంట్‌తో జట్టులోకి రావాలని అనుకున్నాను. ఇప్పటికి అది కుదిరింది...’’ అని చెప్పాడు. మాహీలో నాకు నచ్చింది ఇదే... ఏదైనా సరే ముక్కుసూటిగా చెబుతాడు...
undefined
మనల్ని, మనలోని సత్తాని నమ్మే కెప్టెన్ దొరకడం చాలా అదృష్టం. నీ సొంత టాలెంట్ వల్లే నువ్వు టీమ్‌లోకి వచ్చావు, నేనేం చేయలేదని చెప్పి ఆటగాడిలో నమ్మకం నింపే కెప్టెన్ ఎక్కుడుంటాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప...
undefined
భారత జట్టు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీని చాలా దగ్గర్నుంచి చూశానని చెప్పిన రాబిన్ ఊతప్ప, మాహీ తెలివి, క్రికెట్‌పై అతనికున్న అవగాహన మరో ప్లేయర్‌లో చూడలేదని చెప్పాడు...
undefined
2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఊతప్ప, టీమండియా తరుపున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు...
undefined
2006లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన రాబిన్ ఊత్ప, టీమిండియా తరుపున టీ20ల్లో హాఫ్ సెంచరీ బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ కూడా.
undefined
2008లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప, 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2011లో పూణే వారియర్స్, 2014లో కేకేఆర్‌కి వచ్చిన రాబిన్ ఊతప్ప 2020 దాకా అందులోనే ఉన్నాడు...
undefined
2020లో రాబిన్ ఊతప్పను వేలానికి వదిలేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. వేలంలో ఊతప్పను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. గత సీజన్‌లో 196 పరుగులు చేసిన ఊతప్పను, చెన్నైకి ట్రేడ్ చేసింది ఆర్ఆర్...
undefined
విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీతో ఆకట్టుకున్న రాబిన్ ఊతప్ప మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకే సీజన్‌లో 1000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేయాలని ఆశపడుతున్నట్టు చెప్పాడు రాబిన్ ఊతప్ప...
undefined
2014 సీజన్‌లో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప, 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు..
undefined
click me!