నితీశ్ రాణా జెర్సీపై యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ఫైర్... దాన్ని వెంటనే తొలగించాలంటూ...

First Published Jul 19, 2021, 10:37 AM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున కొన్ని సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న ఓపెనర్ నితీశ్ రాణాకి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. శ్రీలంకలో పర్యటించే జట్టుకి ఎంపికైన కొత్త వాళ్లల్లో నితీశ్ రాణా కూడా ఒకడు..

భారత జట్టు తరుపున ఇంకా ఎంట్రీ చేయకపోయినా తన జెర్సీని ధరించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నితీశ్ రాణా. అయితే ఈ ఫోటోలపై యువీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు...
undefined
యువరాజ్ సింగ్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చేలా నితీశ్ రాణా ఎలాంటి తప్పు పని చేయలేదు. రాణాకి కేటాయించిన జెర్సీ నెంబర్, యువరాజ్ సింగ్ జెర్సీ నెంబర్ కావడమే యువీ ఫ్యాన్స్‌కి కోపం రావడానికి కారణమైంది...
undefined
2000వ సంవత్సరంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్, 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...
undefined
టీమిండియా తరుపున 304 వన్డేలు ఆడిన యువరాజ్ సింగ్ 8701 పరుగులు చేశాడు. టీ20ల్లో, టెస్టుల్లో కలిసి 10వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన యువీ, కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి...
undefined
ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి, క్రీజులోనే రక్తపు వాంతులు చేసుకున్న యువరాజ్ సింగ్... పట్టువదలకుండా బ్యాటింగ్ కొనసాగించి, క్రికెట్‌పై తన డెడికేషన్ ఎలాంటిదో చూపించాడు...
undefined
క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్, జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఎందరో యువకులను ప్రోత్సహించి, వారి సక్సెస్‌లోనూ క్రెడిట్ సంపాదించాడు.
undefined
అలాంటి యువరాజ్ సింగ్ ధరించిన జెర్సీ నెంబర్ 12ని, నితీశ్ రాణాకి కేటాయించింది బీసీసీఐ. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు...
undefined
జెర్సీ నెంబర్ 12 కేవలం జెర్సీ నెంబర్ మాత్రమే కాదని, అది యువరాజ్ సింగ్ ఫ్యాన్స్‌కి ఓ ఎమోషన్ అని... యువీ, టీమిండియాకి అందించిన సేవలకు గుర్తుగా ఆ నెంబర్‌ను అతనికి అంకితం ఇచ్చి, జెర్సీని రిటైర్ చేయాలని కోరుతున్నారు...
undefined
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధరించిన జెర్సీ నెంబర్ 7ను కూడా రిటైర్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం వీటిపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు...
undefined
click me!