వాళ్లిద్దరి కారణంగానే సెంచరీ చేయలేకపోయా... శిఖర్ ధావన్ కామెంట్...

First Published Jul 19, 2021, 10:06 AM IST

కెప్టెన్‌గా ఆడిన మొదటి వన్డేలోనే తనదైన ముద్ర వేశాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేశాడు. అయితే జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్‌కి, హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కి కాకుండా పృథ్వీషాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం విశేషం...

95 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 86 పరుగులు చేసిన శిఖర్ ధావన్, నాటౌట్‌గా నిలిచి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు...
undefined
‘క్రీజులోకి వచ్చినప్పుడే సెంచరీ కొట్టాలని అనుకున్నా. అయితే పృథ్వీషా, ఇషాన్ కిషన్‌ల కారణంగా అది సాధ్యం కాలేదు. టీమ్‌లో యువకులు ఉన్నా, వారికి అంతర్జాతీయ అనుభవం ఉంది...
undefined
కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ల ఎంతో పరిణతి చెందిన ఆటగాళ్లు. జట్టు పర్ఫామెన్స్ సంతోషాన్నిచ్చింది...
undefined
భారత స్పిన్నర్లు చక్కగా రాణించారు. బ్యాటింగ్ మొదలెట్టాక పృథ్వీషా, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసి ముచ్చటేసింది... నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్ నుంచి చూడడం మరింత సంతోషాన్నిచ్చింది...
undefined
ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లలో మొదటి మ్యాచ్ ఆడుతున్నామనే భయం, మానసిక ఒత్తిడి కనిపించడం లేదు. తొలి మ్యాచ్ ఆడుతున్నా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడారు...
undefined
పృథ్వీషా, ఇషాన్ కిషన్ ఆడిన విధానం అయితే మరో లెవెల్. వాళ్లిద్దరూ దంచేయడంతో సెంచరీ పూర్తిచేయడానికి కావాల్సినన్ని పరుగులు మిగల్లేదు. అందుకే నాటౌట్‌గా మిగలాలని ఫిక్స్ అయ్యా...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్..
undefined
భారత మాజీ సారథి కపిల్ దేవ్ తర్వాత శ్రీలంకపై కెప్టెన్‌గా తొలి వన్డే ఆడుతూ విజయాన్ని అందుకున్న రెండో కెప్టెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్...
undefined
కపిల్‌దేవ్ తర్వాత శ్రీలంకపై కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... తొలి మ్యాచులో ఓటములు చవిచూశారు...
undefined
click me!