ఏడాదికాలంగా శుభమన్ గిల్ వన్డేలలో బాగానే ఆడుతున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తే తప్ప గిల్ కు వన్డే ఫార్మాట్ లో అవకాశాలు రావడం లేదు. కానీ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని గిల్ కాపాడుకుంటున్నాడు. ఈ ఏడాది గిల్.. 12 వన్డేలలో 638 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. వెస్టిండీస్ తో పాటు జింబాబ్వే టూర్ లలోనే గాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ లో కూడా గిల్ రాణించాడు.