ఇదిలాఉండగా బీసీసీఐ నియమించిన సీఏసీ.. త్వరలోనే భారత పురుషుల జట్టుకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టీ20కి కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ లను నియమించే విధంగా.. భారత క్రికెట్ లో కూడా స్ప్లిట్ కెప్టెన్సీ, స్ప్లిట్ కోచింగ్ విధానాన్ని అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నది. బహుశా ఐపీఎల్ మినీ వేలం తర్వాత భారత క్రికెట్ లో గుణాత్మక మార్పులు చూడొచ్చని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.