మీ దేశంలో మీ ప్రధానికే సేఫ్టీ లేదు! మాకేం భద్రత ఇస్తారు... ఆసియా కప్ 2023 టోర్నీలో హర్భజన్ సింగ్...

Chinthakindhi Ramu | Published : Mar 17, 2023 10:13 PM
Google News Follow Us

ఆసియా కప్ 2023 టోర్నీ ఎక్కడ జరుగుతుందనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. షెడ్యూల్ ప్రకారం 2023 సీజన్ నిర్వహణ హక్కులు తీసుకున్న పాకిస్తాన్, తమ దేశంలోనే ఆసియా కప్ పెట్టాలని పట్టుబడుతుంటే... తటస్థ వేదికపై నిర్వహించి తీరుతామని బీసీసీఐ చెబుతోంది...

17
మీ దేశంలో మీ ప్రధానికే సేఫ్టీ లేదు! మాకేం భద్రత ఇస్తారు...  ఆసియా కప్ 2023 టోర్నీలో హర్భజన్ సింగ్...


ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత జట్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరగని పని. దీంతో ఒకవేళ పాకిస్తాన్‌లో ఆసియా కప్ టోర్నీ పెడితే, అందులో టీమిండియా పాల్గొనబోదని స్పష్టం చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా... అయితే పీసీబీ దీనిపై వ్యంగ్యంగా స్పందించింది...

27
Harbhajan Singh

టీమిండియాకి పాకిస్తాన్‌లో అడుగుపెట్టేందుకు ఎలాగైతే భయంగా ఉందో, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా భారత్‌కి వెళ్లాలంటే భయపడుతోందని, తమకు కూడా అక్కడ సెక్యూరిటీ కారణాలు ఉన్నాయని కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ... దీనిపై తన స్టైల్‌లో స్పందించాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సిగ్...

37

‘భారత జట్టు, పాకిస్తాన్‌లో అడుగుపెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ మనకి ఏ మాత్రం భద్రత లేదు. ప్రతీ క్షణం అక్కడ ఏమేం జరుగుతున్నాయో అందరం చూస్తున్నాం. అక్కడ వాళ్ల ప్రధాన మంత్రికే భద్రత లేదు. అలాంటి దేశానికి ఎలా వెళ్లగలం...

Related Articles

47
India vs Pakistan

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. అల్లర్లు చెలరేగాయి. చాలామంది తుపాకీలు పట్టుకుని తిరుగుతున్నాయి. అక్కడ టీమిండియా సేఫ్‌గా ఉంటుందనే నమ్మకం లేదు. కాబట్టి ఒకవేళ పాక్‌లోనే ఆసియా కప్ జరిగినా భారత జట్టు అక్కడికి వెళ్లకూడదు.. 

57
India vs Pakistan

తటస్థ వేదికపై ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మంచిది. సొంత ప్రజలకు, నాయకులకే భద్రత కల్పించలేని దేశంలో టోర్నీలు నిర్వహించడం మూర్ఖత్వమే వుతుంది. పాకిస్తాన్‌తో ఏ సిరీస్ ఆడకూడదని టీమిండియా సరైన నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే క్రికెట్ కంటే ఆటగాళ్ల భద్రత ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

67

ఆస్ట్రేలియాతో జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భజ్జీ... ‘టీమిండియా ఎప్పుడూ ఐసీసీ ఫైనల్ మ్యాచ్ ఆడినా అంచనాలు భారీగా ఉంటాయి. మన టీమ్ గెలవాలనే అందరూ కోరుకుంటారు. ఈసారి టీమిండియా విజయంతో తిరిగి వస్తుందని అనుకుంటున్నా...

77
Image credit: PTI

విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. బౌలర్లు కూడా అదరగొడుతున్నారు. ఇండియాలో చూపించిన పర్పామెన్స్, ఇంగ్లాండ్‌లో చూపిస్తే ఆస్ట్రేలియా ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..  

Recommended Photos