టీమిండియాలో సింగిల్ ఫార్మాట్ మొనగాళ్లు! టీ20ల్లో సూర్య వీరత్వం, వన్డేల్లో రాహుల్ రాజసం...

First Published Mar 17, 2023, 9:03 PM IST

సాధారణంగా టెస్టులకు, వైట్ బాల్ ఫార్మాట్లకు వేర్వేరుగా టీమ్స్‌ ఉంటాయి. టీ20, వన్డేలు ఆడే ప్లేయర్లు అందరూ, టెస్టులు ఆడలేరు. టెస్టులు ఆడే ప్లేయర్లందరికీ వైట్ బాల్ క్రికెట్‌లో చోటు దక్కదు. అయితే టీమిండియాలో మాత్రం విచిత్రంగా సింగిల్ ఫార్మాట్ ప్లేయర్లు పెరుగుతున్నారు...

Image credit: PTI

సూర్యకుమార్ యాదవ్‌కి టీ20ల్లో సెన్సేషనల్ రికార్డు ఉంది. గత ఆరు నెలల్లోనే 3 టీ20 సెంచరీలు చేసేశాడు సూర్య భాయ్. టీ20 ఫార్మాట్‌లో నెం.1 బ్యాటర్‌గా టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే వన్డేల్లో సూర్య పర్ఫామెన్స్ శూన్యం...
 

మొదటి 6 వన్డేల్లో 62.25 సగటుతో 261 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన సూర్య, గత 15 వన్డేల్లో కలిపి 172 పరుగులే చేశాడు. వన్డే ఫార్మాట్‌లో సూర్య సగటు 27.06కి పడిపోయింది...
 

టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్‌కి ఇంకా స్థిరమైన చోటు దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్‌‌కి దూరం కావడంతో నాగ్‌పూర్ టెస్టులో ఆడాడు. కానీ అతనికి టెస్టుల్లో వరుస అవకాశాలు దక్కడం సాధ్యమయ్యే పని కాదు...

శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకుని ఫిట్‌గా ఉంటే వన్డేల్లో కూడా సూర్యకుమార్ యాదవ్ కంటే అతన్ని ఆడించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఎందుకంటే వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ సూపర్ సక్సెస్ అయ్యాడు... దీంతో సూర్య, టీ20 స్పెషలిస్టుగానే మిగిలిపోతున్నాడు...

Image credit: Getty

2022 టీ20 వరల్డ్ కప్ వరకూ టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడే అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడిగా ఉండేవాడు కెఎల్ రాహుల్. అయితే వరుసగా ఫెయిల్ అవుతూ టీ20ల్లో, టెస్టుల్లో చోటు కోల్పోయాడు కెఎల్ రాహుల్...

శుబ్‌మన్ గిల్ సెన్సేషనల్ పర్ఫామెన్స్ కారణంగా ఈ రెండు ఫార్మాట్లలో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడం కష్టమే. అయితే వన్డే ఫార్మాట్‌లో మాత్రం రాహుల్ అదరగొడుతున్నాడు. ఆసీస్‌తో తొలి వన్డేలో 75 పరుగులు చేసి, మ్యాచ్‌ని గెలిపించాడు కెఎల్ రాహుల్...
 

KL Rahul Catch

టెస్టుల్లో, టీ20ల్లో అట్టర్ ఫ్లాప్ అయినా వన్డేల్లో మాత్రం కెఎల్ రాహుల్ ప్లేస్‌కి ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే వన్డేల్లో ఐదో స్థానంలో 17 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన కెఎల్ రాహుల్, 7 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ లాంటి ప్లేయర్ చాలా అవసరం...

Image credit: PTI


వీరితో పాటు కేవలం టెస్టులు మాత్రమే ఆడే ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారిలను కూడా సింగిల్ ఫార్మాట్ ప్లేయర్లుగా చెప్పొచ్చు. అయితే విహారి అప్పుడప్పుడూ మాత్రమే టీమ్‌లోకి వచ్చి పోతున్నాడు... అశ్విన అప్పుడప్పుడూ వైట్ బాల్ ఆడుతూ, టెస్టుల్లో లెజెండ్‌గా కొనసాగుతున్నాడు.

click me!