వన్డేలకు పనికి రాని సూర్యకుమార్ యాదవ్... డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ అట్టర్ ఫ్లాప్...

First Published Mar 17, 2023, 6:31 PM IST

సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో ఐసీసీ నెం.1 బ్యాటర్. అయితే వన్డే ఫార్మాట్‌లో మాత్రం అతని ఆటతీరు మరోలా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో సూర్యకుమార్ పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు...

2021 మార్చిలో టీ20 ఆరంగ్రేటం తర్వాత అదే ఏడాది జూలైలో వన్డే ఆరంగ్రేటం చేశాడు సూర్యకుమార్ యాదవ్. అయితే వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇప్పటిదాకా ఆకట్టుకునే ఒక్క పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

టీ20ల్లో ఒకటికి మూడు సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్, రెండేళ్లలో 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేశాడు. వన్డేల్లో మాత్రం సూర్య, పర్ఫామెన్స్ ఏ మాత్రం బాలేదు...

21 వన్డే మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 27.06 సగటుతో 433 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. వన్డేల్లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 10 వన్డేల్లో విరాట్ కోహ్లీ కేవలం 123 పరుగులు చేశాడు...

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, అంతకుముందు వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా 40+ స్కోరు అందుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్... ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు...

వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కానీ అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కేది కాదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతని ప్లేస్‌లో సూర్యకు వన్డేల్లో ఛాన్సులు ఇస్తూ వస్తోంది టీమిండియా. సూర్య మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్‌లను కొనసాగిస్తూ వస్తున్నాడు..

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాది, అరుదైన జాబితాలో చేరిపోయిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.. బంగ్లాపై డబుల్ బాదినా, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో తుది జట్టులోకి రాలేకపోయాడు ఇషాన్ కిషన్...

శుబ్‌మన్ గిల్ వరుస అవకాశాలు దక్కించుకోవడంతో ఇషాన్ కిషన్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి ఫెయిలైన ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ బామ్మర్ది పెళ్లిలో బిజీగా ఉండడంతో ముంబై టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు...

ishan

రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన ఇషాన్ కిషన్, 8 బంతులు ఆడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. 3 1 19 4 17 8* 5 1 2 37 డబుల్ సెంచరీ నెక్ట్స్ మ్యాచ్‌లో 37 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 2, 1, 8, 17, 4, 19, 1, 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడతారు. అంతేకాదు ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. టీ20ల్లో ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్‌లోనూ ఒకేలా ఫెయిల్ అవుతున్నారు...

click me!