యువరాజ్ అలా చెప్పేసరికి కంగారుపడ్డా, అయితే లక్కీగా... మాజీ క్రికెటర్ సురేష్ రైనా

First Published Jul 19, 2021, 12:14 PM IST

భారత జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చిన మ్యాచుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్లలో సురేష్ రైనా ఒకడు. 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సురేష్ రైనా, ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే తన టెస్టు ఆరంగ్రేటం అనుకోకుండా అర్ధాంతరంగా జరిగిందని అంటున్నాడు ‘మిస్టర్ ఐపీఎల్’...

‘2010లో శ్రీలంకతో కొలంబోలో టెస్టు మ్యాచ్. మ్యాచ్‌‌కి ముందు రోజు రాత్రి దాదాపు పన్నెండున్నర, ఒంటి గంట సమయంలో యువరాజ్ సింగ్ నాకు ఫోన్ చేశాడు...
undefined
ఆ సమయంలో ఫోన్ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయి లిఫ్ట్ చేశా... ‘సురేష్, నాకు నిద్రపట్టడం లేదు. నాకు కడుపునొప్పిగా ఉంది. నేను రేపు ఆడలేకపోవచ్చు, నువ్వు రెఢీగా ఉండు...’ అని చెప్పి పెట్టేశాడు...
undefined
సాధారణంగా ఎవ్వరూ ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా చెప్పరు. ఉదయం దాకా చూసి, అప్పుడు బాగోలేకపోతే ఆ ప్లేస్‌లో మరొకరిని ఆడించాలని చెబుతారు. కానీ యువీ మాత్రం నా గురించి ఆలోచించి, ముందుగానే చెప్పాడు...
undefined
రేపు టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాననే ఆలోచనలతో నాకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఎలా ఆడాలి, ఎలా పర్పామ్ చేయాలనే ఆలోచనలతోనే గడిచిపోయింది...
undefined
జట్టులో నేను లేను కాబట్టి టీమ్ మీటింగ్‌లో దీని గురించి చర్చించలేదు, మ్యాచ్ నేను ఆడడం లేదని సరిగా ప్రిపేర్ కూడా అవ్వలేదు. అసలు నేను టెస్టు ఎంట్రీ ఇవ్వబోతున్నా అనే ఆలోచన కూడా నాకు రాలేదు..
undefined
అలాంటిది ఒక్కసారి యువీ ఫోన్ చేసి చెప్పడంతో కంగారు, ప్రెషర్ మొదలయ్యాయి. అయితే నా అదృష్టం, ఆ రోజు టాస్ శ్రీలంక గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసింది...
undefined
సంగర్కర, జయవర్థనే భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంతో రెండు రోజుల పాటు లంక బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత కొన్ని కొబ్బరి నీళ్లు తాగి, నేను బ్యాటింగ్‌కి వెళ్లాను...
undefined
సంగర్కర, జయవర్థనే భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంతో రెండు రోజుల పాటు లంక బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత కొన్ని కొబ్బరి నీళ్లు తాగి, నేను బ్యాటింగ్‌కి వెళ్లాను...
undefined
తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత యువీ పా నా దగ్గరకి వచ్చి, కౌగిలించుకున్నాడు. ‘ఇది నీ ఆట, బాగా ఆడావ్... నాకు చాలా సంతోషంగా ఉంది...’ అన్నాడు...
undefined
ఆ టైంలో జట్టులో అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. సీనియర్ ప్లేయర్లు, జూనియర్ల విషయంలో చాలా కేర్ తీసుకునేవాళ్లు. నన్ను ఓ తమ్ముడిగా చూసేవాళ్లు...
undefined
ఏదైనా వివాదం వస్తే, మీడియా నుంచి మమ్మల్ని కాపాడేవాళ్లు. మానసికంగా, శారీరకంగా ఓ ప్లేయర్‌గా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని నిర్మించేవాళ్లు...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా...
undefined
సురేశ్ రైనా ఆరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, కుమార సంగర్కర 219 పరుగులు, జయవర్థనే 174 పరుగులు చేయడంతో 6424 భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...
undefined
మురళీ విజయ్ 58, వీరేంద్ర సెహ్వాగ్ 99 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ 203 పరుగులతో రాణించాడు. సురేష్ రైనా 228 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. ధోనీ 76 పరుగులు చేయడంతో భారత జట్టు 707 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
undefined
శ్రీలంకపై ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లో సెంచరీతో చేసిన సురేష్ రైనా, ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. 18 టెస్టుల్లో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో 768 పరుగులు చేసి జట్టులో చోటు కోల్పోయాడు.
undefined
click me!