వరల్డ్ కప్ గెలవాలంటే అన్నింటికంటే అది చాలా అవసరం! గంగూలీ అయినా, కోహ్లీ అయినా... - సునీల్ గవాస్కర్

First Published Aug 29, 2023, 1:55 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత 12 ఏళ్లకు స్వదేశంలో తిరిగి వన్డే ప్రపంచ కప్ ఆడనుంది టీమిండియా. ధోనీ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.. 

2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ ఫెవరెట్. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ఆడే భారత జట్టు, నెల రోజుల తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ సేమ్ టీమ్‌ని ఆడించొచ్చు.. మార్పులు జరిగినా ఒకరిద్దరు ప్లేయర్లకే పరిమతం కావచ్చు..

‘వరల్డ్ కప్ గెలవాలంటే అన్నింటికంటే ఎక్కువగా లక్ కలిసి రావాలి. 1983, 2011 వరల్డ్ కప్ టీమ్స్‌ని గమనిస్తే, ఆ రెండు సందర్భాల్లో భారత జట్టులో టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్ చేయడంతో పాట 7, 8, 9 ఓవర్లు బౌలింగ్ చేయగల ప్లేయర్లు ఉండేవాళ్లు..

Latest Videos


లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే బౌలర్లకు కూడా బ్యాటింగ్ చేయడం తెలిసేది. అప్పటి జట్లకు అదే చాలా పెద్ద ప్లస్ పాయింట్. ధోనీ టీమ్‌లో సురేష్ రైనా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్ చేయగలిగేవాళ్లు..
 

అలాగే ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలిగేవాళ్లు. అదే టీమ్‌కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆల్‌రౌండర్లతో నిండిన టీమ్‌ ఉంటే ఎలాంటి టోర్నీనైనా గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..
 

Rohit Sharma and Yuvraj Singh

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్‌లోనూ ఆల్‌రౌండర్లు పుషల్కంగా ఉన్నారు. మనదగ్గర టాలెంట్ తక్కువ ఉందని కాదు. నాకౌట్ స్టేజీ దాటాలంటే మాత్రం టాలెంట్‌తో పాటు లక్ కూడా కలిసి రావాలి. నాకౌట్ మ్యాచుల్లో మనం ఓడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదృష్టం మనకి కలిసి రాలేదు..

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ చూస్తే వర్షం కారణంగా మ్యాచ్ రెండు రోజులు సాగింది. వాతావరణం, పిచ్, పరిస్థితులు అన్ని న్యూజిలాండ్‌కి కలిసి వచ్చాయి. ఆ రోజు కొద్దిగా అదృష్టం తోడై ఉంటే, ఈజీగా ఫైనల్‌కి వెళ్లేవాళ్లం..

సౌరవ్ గంగూలీ టీమ్ అయినా విరాట్ కోహ్లీ టీమ్ అయినా లక్ ఫ్యాక్టర్ మిస్ అవ్వడం వల్లే వరల్డ్ కప్ గెలవలేకపోయింది.. ధోనీ టీమ్‌కి కలిసి వచ్చిన అదృష్టం, రోహిత్‌ సేనకి కలిసి వస్తే వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. 
 

click me!