నేను ఔట్ కాగానే దినేశ్ కార్తీక్ వచ్చి, కోపంగా తిట్టేశాడు! రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నా: రోహిత్ శర్మ

Published : Aug 29, 2023, 12:22 PM ISTUpdated : Aug 29, 2023, 12:38 PM IST

టన్నుల్లో టాలెంట్ ఉన్నా, కాస్త బద్ధకం కారణంగా చేయాల్సినన్ని పరుగులు, సాధించాల్సినంత క్రేజ్ తెచ్చుకోలేకపోయిన క్రికెటర్ రోహిత్ శర్మ. 2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్, అక్టోబర్‌లో తన కెరీర్‌లో ఆఖరి వన్డే వరల్డ్ కప్‌ ఆడబోతున్నాడు..

PREV
18
నేను ఔట్ కాగానే దినేశ్ కార్తీక్ వచ్చి, కోపంగా తిట్టేశాడు! రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నా: రోహిత్ శర్మ
Dinesh Karthik

2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైట్ బాల్ ఫార్మాట్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2018లో విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకోవడంతో ఆసియా కప్, అలాగే నిదహాస్ ట్రోఫీకి కెప్టెన్సీ చేశాడు రోహిత్ శర్మ..

28
Image credit: Getty

2018లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. దినేశ్ కార్తీక్ కెరీర్‌లో గుర్తుండిపోయే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది ఈ మ్యాచ్‌లోనే..

38
Dinesh Karthik

‘కొలంబోలో నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. దాదాపు 170 టార్గెట్. శిఖర్ ధావన్, సురేష్ రైనా త్వరగా అవుట్ అయిపోయారు. నేను కూడా మా స్కోరు దాదాపు 100 దగ్గర ఉన్నప్పుడు అవుట్ అయిపోయాం. ఇంకా 70 కొట్టాలి..

48
Image credit: PTI

నేను అవుటై, డగౌట్‌కి రాగానే అక్కడే ఉన్న దినేశ్ కార్తీక్ నాపై కోపడ్డాడు. అందుకే నేను టాపార్డర్‌లో వెళ్తానని చెప్పా, నువ్వు వినలేదని అన్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కాసేపటికే మనీశ్ పాండే కూడా అవుట్ అయ్యాడు. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కి వెళ్లాడు..
 

58

ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాలి. విజయ్ శంకర్ ఫోర్ బాది అవుటై పోయాడు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. నేను ఇక మ్యాచ్ ఓడిపోయామని ఫిక్స్ అయిపోయా. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయా. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఓడిపోయామంటే మీడియాకి, ఫ్యాన్స్‌కి ఏం చెప్పాలి?

68
Dinesh Karthik and Rohit Sharma

విరాట్ కోహ్లీ లేడు, ధోనీ లేడు.. చాలా ప్రశ్నలు నా బుర్రలో తిరిగాయి. బయటికి వచ్చి చూస్తే డగౌట్‌లో ఎవ్వరూ లేరు. అందులో గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

78

ఒక్కసారిగా హమ్మయ్య... గెలిచామన్నమాట అని ఊపిరి పీల్చుకున్నా. ఆ మ్యాచ్ ఓడిపోయి ఉంటే, మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తది..’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ..

88

నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌లో ఆఖరి ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్ అవుట్ కాగానే శ్రీలంక విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే చివరి బంతిని ఫేస్ చేసిన దినేశ్ కార్తీక్ సిక్సర్ బాది, మ్యాచ్‌ని ముగించేశాడు. 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, మెరుపు ఇన్నింగ్స్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 

click me!

Recommended Stories