2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత సచిన్ టెండూల్కర్‌ని భుజాలపైన ఎత్తుకుని, గ్రౌండ్ మొత్తం తిప్పాడు విరాట్...
2015 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్‌గా ఆడిన విరాట్ కోహ్లీ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి కెప్టెన్సీ చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్ బ్యాటర్‌గా ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ...
28
‘నా కెరీర్‌లో 2011 వన్డే వరల్డ్ కప్ విజయం చాలా చాలా స్పెషల్. ఆ సమయంలో నా వయసు 23 ఏళ్లు. వరల్డ్ కప్ విజయం ఎంత కిక్ ఇస్తుందనే విషయం కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు..
38
Sachin Tendulkar
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండు వరల్డ్ కప్స్ ఆడా, కానీ గెలవలేకపోయాం. సచిన్ టెండూల్కర్‌కి, 2011 వరల్డ్ కప్ ఆఖరిది. అప్పటికే ఆయన చాలా వరల్డ్ కప్స్ ఆడారు. ముంబైలో తన సొంత నగరంలో వరల్డ్ కప్ గెలవడం చాలా స్పెషల్ మూమెంట్..
48
వరల్డ్ కప్ సమయంలో టీమ్‌లోని ప్రతీ ప్లేయర్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉండేది. టీమ్ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు అందరూ సైలెంట్‌గా ఉండేవాళ్లు. అదృష్టవశాత్తు ఆ సమయంలో సోషల్ మీడియా లేదు. ఇప్పటిలా ఉండి ఉంటే అదో పీడకలలా మారి ఉండేది..
58
Virat Kohli
సోషల్ మీడియా లేకపోయినా ఎయిర్‌పోర్ట్‌కి వందలాది మంది ఫ్యాన్స్ వచ్చేవాళ్లు. ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలని చెబుతుండేవాళ్లు. అలాంటి సంఘటనలు సీనియర్లపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతాయి. జూనియర్లకు ఆ విషయం అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుంది.
68
Virat Kohli
బయటి నుంచి చూసే అభిమానుల కంటే, టీమ్‌లో ఉంటూ, టీమ్ తరుపున ఆడే ప్లేయర్లకు వరల్డ్ కప్ గెలవాలని వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. అయితే అన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రావాలంటే కుదరదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ..
78
Virat Kohli
2011 వన్డే వరల్డ్ కప్‌లో 9 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 282 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు..
88
ఫైనల్‌లో 49 బంతుల్లో 35 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, 91 పరుగులు చేసి హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించాడు..