ఇప్పుడున్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి హిట్టర్లకు గురువులాంటోడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ రోజుల్లో టెస్టుల్లో వన్డే బ్యాటింగ్, వన్డేల్లో టీ20 బ్యాటింగ్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవాడు...
ఎలాంటి పొజిషన్‌లో అయినా వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉంటే అవతలి టీమ్ గుండెల్లో రైళ్లు పరుగెట్టాల్సిందే. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్..
25
వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా, శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, ఐసీసీ సీఈవో జెఫ్ అల్లాడీస్ కలిసి వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ని ప్రకటించారు...
35
ఈ సందర్భంగా మాట్లాడిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్, ‘వీరేంద్ర సెహ్వాగ్‌ని ఆపాలంటే కనీసం 19 మంది ఫీల్డర్లు కావాలి. కేవలం 9 మంది ఫీల్డర్లు సరిపోరు. అతని బ్యాటింగ్ అలా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు..
45
కొన్నిరోజుల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇంజమామ్ వుల్ హక్‌ని పొడుగుతూ కామెంట్లు చేశాడు. ‘అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు కానీ ఇంజమామ్ వుల్ హక్, ఆసియాలో బెస్ట్ బ్యాటర్. అతను ఈజీగా 10 ఓవర్లలో 80 పరుగులు కొట్టేసేవాడు...’ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్..
55
Virender Sehwag
17 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్, కెరీర్ చివర్లో టీమ్‌లో చోటు కోల్పోయి కష్టాలు అనుభవించాడు. 20 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్, రిటైర్మెంట్ తర్వాత పాక్ జట్టుకి హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు..