టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్లు దాటిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు మారినా టీమ్ రాత మారడం లేదు. వన్డే వరల్డ్ కప్ 2011 టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఇండియాలో వరల్డ్ కప్ జరగనుంది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి సరిగ్గా 100 రోజుల ముందు షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో మొదలయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, మళ్లీ అహ్మదాబాద్‌లోనే నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది...
28
భారత జట్టు, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొట్టమొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీలో ఆఫ్ఘాన్‌తో, అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. ముంబైలో క్వాలిఫైయర్ 1 టీమ్‌తో మ్యాచ్ ఆడనుంది..
38
లీగ్ స్టేజీలో టాప్ 4లో నిలిస్తే ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, లేదా కోల్‌కత్తాలో నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్‌లో తలబడుతుంది భారత జట్టు. అది కూడా గెలిస్తే.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కి చేరుతుంది..
48
‘23 ఏళ్లు ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాను. అప్పుడు సీనియర్ ప్లేయర్లపై ఎంతటి అంచనాలు ఉంటాయో కూడా తెలీదు. ఈసారి సీనియర్‌గా వరల్డ్ కప్ ఆడబోతున్నా. స్వదేశంలో వరల్డ్ కప్ ఆడడం అంటే ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు..
58
ഇവരില്ല
ప్రతీ క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని అనుభూతి చెందాల్సిందే. ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జరిగిన ప్రతీ సన్నివేశం నా కళ్ల ముందు ఇంకా అలాగే నిలిచి ఉంది. మరోసారి అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..
68
Dhoni-Rohit
‘టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌లో కూడా వేగం పెరిగింది. అందుకే ఈ వరల్డ్ కప్‌లో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో మాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు బాగా తెలుసు...
78
Rohit Sharma
అయితే ఈసారి మరింత పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి వరల్డ్ కప్‌కి ప్రిపరేషన్స్ మొదలెట్టాలి. అక్టోబర్- నవంబర్ మాసాల్లో బెస్ట్ ఇవ్వాలి.
88
Yuvraj celebrates 2011 World Cup win with Virat Kohli
అప్పుడే వరల్డ్ కప్ నెరవేరుతుంది. ముంబైలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..