Indian Cricketers: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరంటే..?

First Published | Dec 16, 2023, 2:00 AM IST

Year ender 2023: 2023 మరికొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. ఈ ఏడాదిలో ఎన్నో మంచి, చెడు ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే.. క్రికెట్ ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు తమ వైవివాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొందరు తాము ప్రేమించిన ప్రేయసి పెళ్లి చేసుకుంటే.. మరికొందరు అరెంజ్ మ్యారెజ్ చేసుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భారత క్రికెట్ జట్టులో ఏడు మంది వివాహం చేసుకున్నారు. అందులో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నుంచి చివరగా ముఖేష్ కుమార్ వరకు మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో తమ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే.. 

కేఎల్ రాహుల్ - అథియా శెట్టి: టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఈ ఏడాదిలో తను చాలా రోజులుగా ప్రేమిస్తున్న అథియా శెట్టిను వివాహం చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే ఈ అథియా శెట్టి. జనవరి 23న రాహుల్-అథియా శెట్టిలు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు. సునీల్ శెట్టి ఫాంహౌస్‌లో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 
 

శార్దూల్ ఠాకూర్- మిట్టాలి పారుల్కర్‌: టీమిండియా ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్, తన ప్రియురాలు మిట్టాలి పారుల్కర్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శార్దూల్ ఠాకూర్ పెళ్లికి రెండేళ్ల ముందు నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం 2023, ఫిబ్రవరి 27న ముంబైలో జరిగింది. వీరి వివాహం మరాఠీ సాంప్రదాయంలో జరగడం విశేషం.


అక్షర్ పటేల్- మేహా పటేల్‌: భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రేయసి మేహా పటేల్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2023, జనవరి 27 న జరిగింది.  అక్షర్- మేహా పటేల్‌ లు చిన్ననాటి నుంచే స్నేహితులు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.వీరి వివాహం వడదోరలో గుజరాతి సాంప్రదాయం ప్రకారం జరిగింది.

Prasidh Krishna

ప్రసిద్ధ కృష్ణ-రచన: భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. జూన్ నెలలో కృష్ణ తన ప్రియురాలు రచనను వివాహం చేసుకున్నాడు. సుదీర్ఘ కాలం సాగిన వీరి ప్రేమ ప్రయాణానికి జూన్ 8న శుభం కార్డు పడింది. దక్షిణ భారతదేశ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.

రుతురాజ్ గైక్వాడ్-  ఉత్కర్ష పవార్‌: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నాడు. గైక్వాడ్.. ఉత్కర్ష అమర్ పవార్ అనే యువతిని ఈ ఏడాది జూన్ 3న వివాహం చేసుకున్నాడు. కాగా..  ఆమె కూడా క్రికెటర్ గమనార్హం. ఆమె మహారాష్ట్ర మహిళల జట్టుకు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

నవదీప్ సైనీ- స్వాతి అస్థానా: మరో భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి ఆస్థానాను నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నాడు.

ముఖేష్ కుమార్ -దివ్య సింగ్‌: భారత ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ వివాహం ఈ ఏడాది చివరలో జరిగింది. ముఖేష్ వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్‌తో నవంబర్ 28న జరిగింది. ముఖేష్ వివాహం కోసం సిరీస్‌లోని ఒక మ్యాచ్ నుండి సెలవు తీసుకున్నాడు. తరువాతి మ్యాచ్‌లో తిరిగి వచ్చాడు.వీరి వివాహం గోరఖ్‌పూర్ రిసార్టులో జరిగింది. 

Latest Videos

click me!