ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌..?

First Published | Dec 23, 2023, 4:55 PM IST

Hardik Pandya ruled out of IPL: ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్ గా తొల‌గిస్తూ హిర్ధిక్ ను కొత్త కెప్టెన్ గా ఎంపిక చేసింది ముంబై ఫ్రాంఛైజీ.
 

Rohit Sharma, Hardik Pandya

Rohit Sharma to lead Mumbai Indians: ఇటీవ‌ల ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా తొల‌గించ‌బ‌డిన హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ తిరిగి ముంబై జ‌ట్టు కెప్టెన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించున్నాడ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హార్దిక్ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో రాబోయే ఐపీఎల్ ఆట‌డం అనుమాన‌మేన‌నే రిపోర్టులు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ప్రపంచకప్ సమయంలో గాయపడిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే టీ20 సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉండగా, రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు కూడా దూరం కానున్నాడ‌ని తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు హార్దిక్ దూరమవుతాడనీ, ఐపీఎల్ 17వ సీజన్ ఆడ‌క‌పోవ‌చ్చున‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Rohit Sharma, Hardik Pandya

హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఈ రిపోర్టులు వాస్తవమైతే నిజంగానే టీమిండియాతో పాటు ముంబై ఇండియ‌న్స్ కు కూడా పెద్ద దెబ్బ అని చెప్పవ‌చ్చు. హార్దిక్ పాండ్యా గాయం తీవ్రంగా ఉందనీ, అతను మొత్తం ఐపీఎల్ 2024కి దూరంగా ఉండవచ్చని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. హార్దిక్ ఐపీఎల్ నుంచి నుండి తప్పుకుంటే, అది ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే ముంబై అతన్ని మొదట నగదు ఒప్పందంలో వర్తకం చేసి, ఆపై రోహిత్ శర్మ స్థానంలో అతన్ని కెప్టెన్‌గా చేసింది. అయితే హార్దిక్ పాండ్యాకు సంబంధించి బీసీసీఐ కానీ, ముంబై ఇండియన్స్ కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Latest Videos


Rohit Sharma-Hardik Pandya

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లో హార్దిక్ గాయప‌డ్డాడు. టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ మడమ గాయానికి గురయ్యాడు. అప్ప‌టి నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఇటీవ‌ల ముంబై జ‌ట్టు హార్దిక్ ను జ‌ట్టులోకి తీసుకోవ‌డంతో పాటు వెంట‌నే ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిలిపిన రోహిత్ ను ప‌క్క‌న పెట్టి సార‌థిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇప్పుడు హార్దిక్ ఆడ‌క‌పోతే కెప్టెన్సీ ఎవ‌రికి ఇస్తారు? ఒక వేళ రోహిత్ ను మ‌ళ్లీ కెప్టెన్ బాధ్య‌త‌లు తీసుకోమ్మంటే ఎలా స్పందిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

click me!