ఈ బుమ్రా- వోమ్రా ఏం చేస్తారు... విరాట్ కోహ్లీ కామెంట్లను బయటపెట్టిన పార్థివ్ పటేల్...

Published : Mar 28, 2022, 05:21 PM IST

ఐపీఎల్‌లో ఓ అనామక బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చి, టీమిండియా స్టార్ బౌలర్‌గా మారాడు జస్ప్రిత్ బుమ్రా. 2013లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన జస్ప్రిత్ బుమ్రా... ఐపీఎల్‌లో, భారత క్రికెట్‌లో తిరుగులేని స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. అయితే బుమ్రాను, విరాట్ కోహ్లీ చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడాడట...  

PREV
19
ఈ బుమ్రా- వోమ్రా ఏం చేస్తారు... విరాట్ కోహ్లీ కామెంట్లను బయటపెట్టిన పార్థివ్ పటేల్...

భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, ఐపీఎల్‌లో ఎక్కువ కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు.

29

సీఎస్‌కేలో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన పార్థివ్ పటేల్, ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరుపున ఆడాడు..

39

2014తో పాటు 2018 నుంచి 2022 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు పార్థివ్ పటేల్... అయితే 2020 సీజన్‌లో పార్థివ్ పటేల్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు...

49

‘2014 సీజన్‌లో నేను ఆర్‌సీబీలో ఉన్నాను. అప్పుడు బుమ్రాను టీమ్‌లోకి తీసుకొద్దామని విరాట్ కోహ్లీకి చెప్పాను. అతని రికార్డులు, బౌలింగ్ చూడమని విరాట్‌కి సూచించాను...

59

అయితే విరాట్ నా మాటలను పట్టించుకోలేదు... ‘వదిలేయ్ యార్... ఈ బుమ్రా- వొమ్రా ఏం చేస్తారు...’ అంటూ సమాధానం ఇచ్చాడు. బుమ్రా ఆట ఏంటో నాకు బాగా తెలుసు...

69

రంజీ ట్రోఫీలో రెండు మూడేళ్లు ఆడిన తర్వాత బుమ్రా, ఐపీఎల్‌కి వచ్చాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరుపున మొదటి సీజన్ ఆడాడు. 2014లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

79

2015 సీజన్‌లో అయితే అతన్ని మధ్యలోనే ఇంటికి పంపేయాలనే చర్చలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత అతను కొద్దికొద్దిగా బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటూ వచ్చాడు...

89

ముంబై ఇండియన్స్ కూడా బుమ్రాని పూర్తిగా నమ్మి, అతనికి వరుసగా అవకాశాలు ఇచ్చింది. అతని హర్డ్ వర్క్, ముంబై ఇండియన్స్ లాంటి సపోర్ట్ కారణంగా బుమ్రా.. స్టార్ బౌలర్‌గా ఎదిగాడు...’ అంటూ కామెంట్ చేశాడు పార్థివ్ పటేల్...

99

ఐపీఎల్ కెరీర్‌లో 107 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా 130 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న బుమ్రా, ఈ ఏడాది రిటెన్షన్‌లో రూ.12 కోట్లు అందుకోబోతున్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories