రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్... అభ్యంతరం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా...

First Published Dec 4, 2020, 4:59 PM IST

జట్టులోకి 12వ ప్లేయర్‌గా యజ్వేంద్ర చాహాల్...

అభ్యంతరం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా జట్టు...

మారిన రూల్స్‌ను అనుకూలంగా మార్చుకున్న టీమిండియా...

95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు ఓ గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
undefined
23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్‌కి రాలేదు.
undefined
అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజ్వేంద్ర చాహాల్ జట్టులోకి వచ్చాడు.
undefined
మారిన ఐసీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా ఆటగాడు మ్యాచ్ సమయంలో గాయపడితే అతని స్థానంలో మరో ప్లేయర్‌ని ఆడించవచ్చు. అయితే బ్యాట్స్‌మెన్ స్థానంలో బ్యాట్స్‌మెన్, బౌలర్ స్థానంలో బౌలర్, స్పిన్నర్ స్థానంలో స్పిన్నర్‌ని మాత్రమే ఆడించాలి.
undefined
ఈ నియమాన్ని అనుసరించి రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ను తుదిజట్టులోకి తీసుకొచ్చింది టీమిండియా. అయితే ఈ మార్పుకు ఆస్ట్రేలియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
undefined
మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ బంతి, రవీంద్ర జడేజా హెల్మెట్‌కి తగిలింది. అయితే ఆ గాయం తర్వాత ఫిజియో సాయం కూడా తీసుకోకుండా బ్యాటింగ్ కొనసాగించిన రవీంద్ర జడేజా... ఆఖర్లో రెండు బౌండరీలు కూడా బాదాడు.
undefined
మరి బ్యాటింగ్ చేసేటప్పుడు కలగని ఇబ్బంది, బౌలింగ్ చేయడానికి ఎందుకు కలుగుతుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశ్నించాడు.
undefined
అయితే ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఇచ్చిన వివరణతో ఆసీస్ కెప్టెన్ ఫించ్ కానీ, లాంగర్ కానీ సంతృప్తి చెందినట్టు కనిపించలేదు.
undefined
2019 వరల్డ్‌కప్‌‌కి ముందు మార్చిన ఈ నిబంధనలను కరెక్టుగా వాడుకున్న టీమిండియా, చాహాల్‌లో జట్టులోకి తెచ్చింది.
undefined
అన్యూహ్యంగా జట్టులోకి వచ్చిన చాహాల్, కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను అవుట్ చేయడం విశేషం.అప్పటిదాకా దూకుడుగా ఆడుతున్న ఫించ్, మిస్ ఫీల్డ్ కారణంగారెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాండ్యా అద్భుత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.
undefined
click me!