రోహిత్ శర్మతో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్! వన్‌ డౌన్‌లో శుబ్‌మన్ గిల్... వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా...

Published : Jul 06, 2023, 05:40 PM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిన భారత జట్టు, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి సిద్దమవుతోంది. నెల రోజుల బ్రేక్ తర్వాత జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌‌కి ప్రకటించిన జట్టులో సీనియర్ బ్యాటర్ ఛేతశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు...

PREV
16
రోహిత్ శర్మతో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్! వన్‌ డౌన్‌లో శుబ్‌మన్ గిల్... వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా...

ఛతేశ్వర్ పూజారా ప్లేస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే విండీస్ టూర్‌లో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్ చేయబోతున్నట్టు సమాచారం...
 

26

గురువారం జరిగిన ఇంట్రా స్వార్డ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌కి వచ్చాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు...

36

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. అది కాకపోయినా వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 వరకూ రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగే అవకాశం అయితే లేదు..
 

46

దీంతో రోహిత్ శర్మ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని ఓపెనర్‌గా సిద్ధం చేస్తున్న టీమిండియా, అతన్ని దానికి అనుగుణంగా ప్రిపేర్ చేయాలని భావిస్తోందట. ఇప్పటికే టెస్టుల్లో సెటిల్ అయిన శుబ్‌మన్ గిల్‌ని వన్‌డౌన్‌లో ఆడించబోతున్నట్టు తెలుస్తోంది..

56
Image credit: PTI

టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు టీమ్‌కి అందుబాటులో ఉండబోతున్నాడు. కనీసం టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకునేవరకూ అయినా విరాట్, టెస్టుల్లో కొనసాగడం పక్కా. దీంతో టూ డౌన్‌ ప్లేస్‌లో ఇప్పటికిప్పుడు కొత్త బ్యాటర్‌ని తయారుచేయాల్సి అవసరం అయితే లేదు..
 

66

ఈ కారణంగా సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోని సెలక్టర్లు, రుతురాజ్ గైక్వాడ్‌ని ఎంపిక చేసినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం మాత్రం చాలా కష్టమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories