బెన్ స్టోక్స్ ఆడుతుంటే ధోనీ గుర్తొచ్చాడు.. లార్డ్స్ ఇన్నింగ్స్‌పై రికీ పాంటింగ్ కామెంట్..

First Published Jul 6, 2023, 3:23 PM IST

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలిచి, యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది. అయితే ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 155 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు...

Ben Stokes

371 పరుగుల లక్ష్యఛేదనలో 45 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో ఓపెనర్ బెన్ డక్లెట్‌తో కలిసి 132 పరుగుల భాగస్వామ్యం జోడించిన బెన్ స్టోక్స్,  214 బంతుల్లో 155 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

‘ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ఫ్రీగా మిడిల్ ఆర్డర్‌లో వచ్చి, లోయర్ ఆర్డర్‌తో కలిసి తానేం చేయగలడో చేసి వెళ్లిపోతున్నాడు బెన్ స్టోక్స్. అతని ఆట చూస్తుంటే నాకు ధోనీయే గుర్తుకువచ్చాడు..
 

Latest Videos


మాహీ, టీ20 మ్యాచుల్లో ఇదే విధంగా ఫినిషింగ్ చేసేవాడు. టెస్టు మ్యాచుల్లో బెన్ స్టోక్స్ ఇలాంటి మ్యాజిక్ చూపిస్తున్నాడు. టెస్టుల్లో ఎందరో గొప్ప కెప్టెన్లు, గొప్ప ప్లేయర్లు, గొప్ప బ్యాటర్లు ఉండొచ్చు కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా ఆడేవాళ్లు చాలా తక్కువ మంది..

మ్యాచ్ గెలవడానికి ఓ కెప్టెన్‌గా, ఓ ప్లేయర్‌గా ఏం చేయాలో బెన్ స్టోక్స్‌కి బాగా తెలుసు. ఇంతకుముందు ఇలాగే బెన్ స్టోక్స్, టెస్టు మ్యాచ్‌‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. లార్డ్స్‌లో ఇలాంటి ఇన్నింగ్స్ మరోసారి చూడవచ్చని అనుకున్నా..
 

2019 హెడ్డింగ్‌లేలో బెన్ స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్‌కీ, ఈ ఇన్నింగ్స్‌కీ చాలా పోలికలు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో కూడా మార్కస్ హారీస్, బెన్ స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ని డ్రాప్ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ డ్రాప్ చేశాడు..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 

click me!