ఘనంగా పాక్ పేసర్ హారీస్ రౌఫ్ వివాహం... పెళ్లికి ముందే ప్రైవేట్ వీడియోలు వైరల్...

Published : Jul 06, 2023, 04:45 PM IST

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇస్లామాబాద్‌లోని తన స్వగృహంలో జరిగిన ఈ ఈవెంట్‌కి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో మున్జా మసూద్ మాలిక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హారీస్ రౌఫ్, జూలై 6న ఆమెను వివాహం చేసుకున్నాడు...

PREV
16
ఘనంగా పాక్ పేసర్ హారీస్ రౌఫ్ వివాహం... పెళ్లికి ముందే ప్రైవేట్ వీడియోలు వైరల్...
Haris Rauf

వివాహ వేడుకకి కొన్ని గంటల ముందే మున్జా మసూద్ మాలిక్‌కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో మున్జా మసూద్ మాలిక్, ఎవరో మరో వ్యక్తితో చనువుగా ఉన్నట్టుగా కనిపించింది.

26

ఈ వీడియోపై మున్జా మసూద్ మాలిక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వీడియోలో ఉన్నది మున్జా మసూద్ కాదని, హారీస్ రౌఫ్ అంటే గిట్టని వాళ్లు ఎవరో కావాలని అతని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అంటున్నాయి మీడియా వర్గాలు..

36
haris rauf

1993, నవంబర్ 7న రావల్పిండిలో జన్మించిన హారీస్ రౌఫ్, 2017లో ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2019-20 పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సీజన్‌లో 10 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన హారీస్ రౌఫ్, ఈ పర్ఫామెన్స్‌తో పాక్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు..

46
Haris Rauf

ఫిబ్రవరి 2020లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20 ఆరంగ్రేటం చేసిన హారీస్ రౌఫ్, రెండో టీ20 మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. అప్పటి నుంచి పాక్ టీమ్‌లో కీలక సభ్యుడిలా కొనసాగుతూ వస్తున్న హారీస్ రౌఫ్, బిగ్ బాష్ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు..

56

పాక్ మోడల్‌ మున్జా మసూద్ మాలిక్‌కి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్‌ స్టార్‌గా ఎదిగిన మున్జా మసూద్ మాలిక్, కొన్ని మ్యాచులకు హాజరై హారీస్ రౌఫ్‌ని ఎంకరేజ్ చేసింది. ముట్టుకుంటే మాసిపోతుందుమో అనేంతలా పాల మీగడలా మెరిసిపోయే మున్జా మసూద్ మాలిక్ అందానికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు.. 

66

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా విజయానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో వరుసగా 2 భారీ సిక్సర్లు బాదాడు విరాట్ కోహ్లీ.. 

click me!

Recommended Stories