IND vs PAK: ఐపీఎల్ లో యంగ్ కోటీశ్వరుడు.. కానీ పాక్ పై ప‌నిచేయ‌ని వైభవ్ సూర్య‌వంశీ మాయాజాలం

First Published | Nov 30, 2024, 7:43 PM IST

IND vs PAK: పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ 46 పరుగుల తేడాతో భార‌త్ పై విజయం సాధించింది. భారీ అంచనాలున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. 
 

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 మెగా వేలంలో హాట్ టాపిక్ అయిన పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఐపీఎల్ లో కోటి రూపాయ‌ల‌కు పైగా ధ‌ర‌ప‌లికి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మిలియనీర్ అయిన తర్వాత తన మొదటి మ్యాచ్‌లోనే ఘోరంగా ఔట్ అయ్యాడు. పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండానే పెవిల‌య‌న్ కు చేరాడు. అదికూడా దాయాది దేశ‌మైన పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో. 

Vaibhav Suryavanshi

13 ఏళ్ల వైభవ్ సూర్య‌వంశీ జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో చరిత్ర సృష్టించాడు. వేలంలో కోనుగోలు చేయ‌బ‌డిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.  అత‌న్ని 1 కోటీ 10 ల‌క్ష‌లు చెల్లించి రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులో చేర్చుకుంది. అయితే ఈ యువ సంచలనం పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో గొప్ప  బ్యాటింగ్ చేయలేదు. 


ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడు వైభవ్ సూర్య‌వంశీ

కేవలం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో కఠినమైన బిడ్డింగ్ వార్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చరిత్ర పుస్తకాల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ కొనుగోలుతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్‌ను నిలబెట్టింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడుగా కూడా వైభవ్ నిలిచాడు.

Vaibhav Suryavanshi

పాకిస్థాన్‌పై  పెద్ద‌గా రాణించ‌ని వైభ‌వ్ సూర్య‌వంశీ 

ఐపీఎల్ వేలంలో కోటీశ్వరుడు అయిన తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న‌ వైభవ్ గొప్ప‌గా బ్యాటింగ్ చేయలేదు. అండర్-19 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతను 9 బంతులు ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అలీ రజా బౌలింగ్ లో సాద్ బాగ్ క్యాచ్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ తన ఫామ్‌ను కనబరచకపోయినా.. అయినా కూడా చరిత్ర సృష్టించాడు.

1 పరుగుకే ఔట్ అయినా చరిత్ర సృష్టించాడు

ఈ మ్యాచ్‌తో వైభవ్‌కి వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అతను తన మొదటి అండర్-19 వ‌న్డే మ్యాచ్‌లో మార్క్ ఇన్నింగ్స్ ఆడ‌క‌పోయినా వైభవ్ భారతదేశం తరపున అండర్-19 ODI అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. అతను 13 సంవత్సరాల 248 రోజుల వయస్సులో అత‌ని ఈ ఘ‌న‌త సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు 14 ఏళ్ల 311 రోజుల వయసులో భారత్‌ తరఫున అండర్-19 వన్డే అరంగేట్రం చేసిన పీయూష్ చావ్లా పేరిట ఉంది.

ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభ‌వ్ సూర్య‌వంశీ 

వైభవ్ ఈ ఏడాది అండర్-19 టెస్టులో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించి క్రికెట్ లో సంచ‌ల‌నం రేపాడు. అక్టోబరులో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై అతను ఈ ఘనత సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ భారతదేశ అండర్-19 జట్టు కోసం తన మొదటి రెడ్-బాల్ మ్యాచ్‌లో కేవలం 58 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. సూర్యవంశీ 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 మ్యాచ్‌లో బీహార్ తరపున తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.

Latest Videos

click me!