మా గురించి ఏడవడం తర్వాత, మీరు కనీసం ఫైనల్‌కి అయినా రాగలరా!? పాకిస్తాన్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

Published : Jun 16, 2023, 11:05 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమితో పాక్ మాజీ క్రికెటర్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. అసలు టీమిండియా అలా చేసి ఉంటే గెలిచేదని, ఇలా ఆడి ఉంటే గెలిచేవాళ్లంటూ విమర్శలు వెల్లువెత్తాయి...  

PREV
16
మా గురించి ఏడవడం తర్వాత,  మీరు కనీసం ఫైనల్‌కి అయినా రాగలరా!? పాకిస్తాన్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

పాకిస్తాన్ టీమ్‌ అంటే తెగ ఇష్టపడే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నజీర్ హుస్సేన్ అయితే భారత ఆటగాళ్లు, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని చూసి బ్యాటింగ్ ఎలా ఆడాలో నేర్చుకోవాలంటూ కామెంట్ చేశాడు. ఈ విమర్శలపై తన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
 

26

‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియా ఓడిపోయినందుకు చాలా మంది సంతోషిస్తున్నారు. ఇంకొందరైతే టీమిండియా ఇలా ఆడాల్సింది, అలా ఆడాల్సిందని సలహాలు ఇస్తున్నారు. మా గురించి సరే, అసలు మీరు ఫైనల్‌కి అయినా రాగలరా?

36

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మీ ప్లేస్ ఎక్కడుందో ఓసారి గుర్తు చేసుకోండి. ఫైనల్ చేరిన రెండు టీమ్స్ కూడా టాప్ టీమ్స్. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడండి..

46

అయినా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్‌యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి.

56
Babar Azam

అయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులు పెట్టలేదు? ఎందుకని? ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచులు పెడితే రేటింగ్స్ పగిలిపోతాయి, బోర్డులకు కాసుల పంట పండుతుంది..

66

ఐసీసీ, స్వయంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహిస్తోంది. కాబట్టి ఈ టోర్నీలో పాల్గొనే అన్ని టీమ్స్ కూడా మిగిలిన టీమ్స్‌తో మ్యాచులు ఆడేలా షెడ్యూల్ రూపొందించాలి. కనీసం రెండేళ్లకి ఓసారి అయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు చూడొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా.. 

click me!

Recommended Stories