అహంకారం వల్లే టీమిండియాకి ఈ గతి! ఐపీఎల్‌ని చూసుకుని... వెస్టిండీస్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు..

Published : Jun 16, 2023, 09:52 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ చేరింది టీమిండియా. ఫైనల్స్‌లో రోహిత్ శర్మకు ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డు, ఎన్నో సెంటిమెంట్లు, మరెన్నో అంచనాలు... అయితే రిజల్ట్ టీమిండియా ఓటమి...

PREV
18
అహంకారం వల్లే టీమిండియాకి ఈ గతి! ఐపీఎల్‌ని చూసుకుని... వెస్టిండీస్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు..

ట్రావిస్ హెడ్ 163, స్టీవ్ స్మిత్ 121 పరుగులతో సెంచరీలు చేసి 285 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించిన ఆసీస్, 444 పరుగుల భారీ టార్గెట్‌ని టీమిండియా ముందు పెట్టింది...
 

28

ఈ లక్ష్యఛేదనలో ఐదురోజు తొలి సెషన్‌లో 70 పరుగులు మాత్రమే జోడించి, 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీమిండియా ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విండీస్ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్...

38

‘టీమిండియా ఓటమికి వాళ్ల అహంకారమే కారణం. ఐపీఎల్‌ని చూసుకుని విర్రవీగుతూ మిగిలిన జట్లను చులకనగా చూస్తున్నారు. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. వాళ్లకు టెస్టు క్రికెట్ కావాలా? టీ20 క్రికెట్ కావాలా? తేల్చుకోవాలి...

48

టీ20 క్రికెట్‌లో రాణించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ బ్యాటుకీ, బంతికీ మధ్య పోరాటం ఉండదు. బ్యాటర్ల కోసం చాలా రూల్స్ ఉంటాయి. టెస్టు క్రికెట్‌లో అలా ఉండదు...

58

భారత జట్టులో చాలా బ్యాటింగ్ బలం ఉంది. అయితే అంత మందిలో అజింకా రహానే ఒక్కడే పోరాడాడు. శుబ్‌మన్ గిల్‌, ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాడు, కానీ ఇంగ్లాండ్‌లో పిచ్‌ల మీద అతని టెక్నిక్ పనిచేయలేదు..

68

విరాట్ కోహ్లీ కూడా అంతే. రెండో ఇన్నింగ్స్‌లో అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది టీమిండియా. మధ్యలో బ్రేక్ రాకపోయి ఉంటే విరాట్ కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసేవాళ్లమేమో. నాలుగో రోజు ముగిసిన తర్వాత అతనిపై ఉన్న అంచనాలు చూసి కోహ్లీ ఒత్తిడికి లోనై ఉంటాడు..

78

ఛతేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ వంటి మంచి ప్లేయర్లు కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఫెయిల్ అయ్యారు. వీళ్లలో చాలా మంది స్వదేశంలోనే బాగా ఆడుతున్నారు, విదేశాల్లోకి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. 
 

88

రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్‌ని పక్కనబెట్టడం బుద్దిలేని పని. ఎవ్వరైనా స్పిన్నర్‌ని ఆడించాలని అనుకుంటే బెస్ట్ స్పిన్నర్‌ని తీసుకుంటారు కానీ అశ్విన్‌ని కూర్చోబెట్టి, జడేజాని ఆడించడంలో వాళ్ల స్ట్రాటెజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు.’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్.. 

click me!

Recommended Stories