ఆసియా కప్‌లో బుమ్రా, రాహుల్, అయ్యర్ రీఎంట్రీ! వన్డే వరల్డ్ కప్‌ నాటికి రిషబ్ పంత్ కూడా...

Published : Jun 16, 2023, 10:31 AM IST

గాయాలతో టీమ్‌కి దూరమైన ప్లేయర్లు, ఒక్కొక్కరిగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి దూరమైన నలుగురు ప్లేయర్లు, వచ్చే 4 నెలల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం..

PREV
16
ఆసియా కప్‌లో బుమ్రా, రాహుల్, అయ్యర్ రీఎంట్రీ! వన్డే వరల్డ్ కప్‌ నాటికి రిషబ్ పంత్ కూడా...
KL Rahul

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో గాయపడిన కెఎల్ రాహుల్, నెల రోజులుగా టీమ్‌కి దూరంగా ఉంటున్నాడు. లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్, ప్రస్తుతం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి... కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు..

26
Jasprit Bumrah

అప్పుడెప్పుడో గత ఏడాది ఆసియా కప్ 2022 సీజన్‌కి ముందు వెన్ను గాయంతో బాధపడిన జస్ప్రిత్ బుమ్రా, నెల రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చి 2 మ్యాచులు ఆడాడు. అయితే గాయం తిరగబెట్టడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా దూరమయ్యాడు జస్ప్రిత్ బుమ్రా...

36
Jasprit Bumrah

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌ మొత్తానికి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఆగస్టులో జరిగే ఆసియా కప్ 2023 టోర్నీతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతకుముందు వెస్టిండీస్ టూర్‌లో జరిగే టీ20 సిరీస్‌లో కూడా బుమ్రాకి చోటు దక్కవచ్చని సమాచారం..

46

బౌలర్లు వెన్నునొప్పితో బాధపడడం కామన్, బ్యాటర్‌కి బ్యాక్ పెయిన్ రావడం వెరైటీ. అలా వెన్ను గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. గాయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, ఆసియా కప్ 2023 టోర్నీ నుంచి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

56
Rishabh Pant

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, మరో ఏడాది దాకా క్రికెట్ ఆడడం అనుమానమే అనుకున్నారంతా. అయితే రిషబ్ పంత్ కోలుకుంటున్న విధానం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు...

66
Rishabh Pant

ఇప్పటికే బెంగళూరులో ఎన్‌సీఏలో చేరిన రిషబ్ పంత్, వచ్చే అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ సమయానికి టీమ్‌కి అందుబాటులోకి రావచ్చని టీమిండియా భావిస్తోంది. ఇదే జరిగితే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పూర్తి బలగంతో బరిలో దిగనుంది టీమిండియా.. 

Read more Photos on
click me!

Recommended Stories