ఒక్క ఫైనల్‌తో ఎలా డిసైడ్ చేస్తారు? మూడు ఫైనల్స్ పెడితే మజా ఉంటది... డేవిడ్ వార్నర్ కామెంట్...

First Published Jun 4, 2023, 11:47 AM IST

టెస్టులకు క్రేజ్ పెంచేందుకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చింది ఐసీసీ. అయితే మొదటి సీజన్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్‌, పాయింట్ల కేటాయింపుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సీజన్‌లో చాలా మార్పులు చేసింది... 
 

రెండు సంవత్సరాల పాటు సాగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతను ఒక్క ఫైనల్‌తో డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్..
 

Image credit: PTI

‘డబ్ల్యూటీసీ ఫైనల్ గొప్పగా ఉంటుందనుకుంటున్నా. అయితే డబ్ల్యూటీసీ విన్నర్‌ని ఒక్క ఫైనల్‌తో డిసైడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. కనీసం మూడు మ్యాచుల సిరీస్‌లా పెడితే అదిరిపోద్ది కదా... రెండేళ్ల పాటు బెస్ట్ క్రికెట్ ఆడిన రెండు జట్లే ఫైనల్‌కి వస్తున్నాయి...

Image credit: PTI

హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా లేకుండా తటస్థ వేదికపై ఫైనల్ నిర్వహిస్తున్నారు. అయితే ఒకే మ్యాచ్‌లో విజేతను నిర్ణయించడం మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో మేమంతా ఆడాం. అయితే ఈసారి ఆతిథ్య జట్టు లేకుండా ఫైనల్ ఆడబోతున్నాం..

విదేశీ గడ్డపైన డ్యూక్స్ బాల్స్‌తో వరల్డ్ బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య సమరం... చాలా గొప్ప ఫీలింగ్ కలుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగ ఎదురుచూస్తున్నా. గత రెండేళ్లుగా మేం చాలా చక్కని క్రికెట్ ఆడాం. ఇండియా, ఎలాగైనా ఫైనల్‌కి వస్తుందని మాకు తెలుసు..

వారిని ఎలా ఫేస్ చేయాలో ముందునుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. ఇది రెండు వరల్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్స్ మధ్య ఫైట్‌గా నేను చూస్తున్నా. బ్యాటర్లు ఉన్నా, ఫైనల్ మ్యాచ్ రిజల్ట్‌ని తేల్చేది బౌలర్లే...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్... 

click me!