టీమిండియాని ఊరిస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ సెంటిమెంట్... వెస్టిండీస్, పాకిస్తాన్‌ తర్వాత...

Published : Jun 03, 2023, 06:39 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023 టోర్నీ మీద టీమిండియా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాని టెస్టు ఛాంపియన్‌షిప్‌ని రోహిత్ శర్మ తీసుకువస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్...

PREV
16
టీమిండియాని ఊరిస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ సెంటిమెంట్... వెస్టిండీస్, పాకిస్తాన్‌ తర్వాత...

రోహిత్ శర్మ, ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా మెప్పించలేకపోయినా విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, అజింకా రహానే వంటి కీ ప్లేయర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు..

26
AUS-IND

అదీకాకుండా ఐసీసీ టోర్నీల్లో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడిన ప్రతీ జట్టు, ఇంతకుముందు టైటిల్స్ గెలవడం విశేషం.
 

36
1975 World Cup: Glenn Turner (New Zealand) — 333 runs (4 matches)

వన్డే వరల్డ్ కప్‌ని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ ఆడి టైటిల్స్ గెలిచింది వెస్టిండీస్. 1975లో మొదటి వన్డే వరల్డ్ కప్ గెలిచిన విండీస్, 1979లో రెండో ప్రపంచకప్ గెలిచింది. 1983లో మూడోసారి ఫైనల్ చేరినా టీమిండియా ఊహించని షాక్ ఇచ్చింది..

46

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడిన మొదటి జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో 5 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత 2009 సీజన్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది...

56
Indian Test Team

టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీల్లో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడబోతున్న మొదటి జట్టు టీమిండియా. మొదటి సీజన్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, వన్డే, టీ20 వరల్డ్ కప్స్‌లో వర్కవుట్ అయిన సెంటిమెంట్‌ కలిసి వస్తే ఈసారి ఛాంపియన్‌షిప్ గెలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.. 

66

అదీకాకుండా కెప్టెన్‌గా ఇప్పటిదాకా ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని రోహిత్ శర్మ ట్రాక్ రికార్డుపైన కూడా భారత జట్టు అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిస్తే, ఆ తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రెట్టింపు ఉత్సాహంతో బరిలో దిగుతుంది టీమిండియా. ఫైనల్‌ రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఎప్పటిలాగే ప్రెషర్‌ భారీగా పడుతుంది...

click me!

Recommended Stories