వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్: టీమిండియా ఫైన‌ల్ ఛాన్స్‌లు ఎలా ఉన్నాయి?

First Published | Jan 1, 2025, 2:25 PM IST

WTC Final scenarios: పాకిస్థాన్ పై దక్షిణాఫ్రికా గెలుపుతో జూన్ లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ లో బెర్త్ ను క‌న్ఫార్మ్ చేసుకుంది. ఎంసీజీలో గెలుపుతో ఆస్ట్రేలియా ఈ రేసులో 2వ స్థానంలో ఉంది. అయితే, భార‌త్ కు డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ఛాన్స్‌లు ఇంకా ఉన్నాయా?
 

India vs Australia

WTC Final scenarios: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో జ‌రిగిన‌  బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓడిపోవడంతో రోహిత్ శర్మ అండ్ కో 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసు అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పుడు భార‌త జ‌ట్టు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు అర్హ‌త సాధించాలంటే త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఇతర జ‌ట్ల‌ ఫలితాలపై ఆధారపడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 

సోమవారం మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత వరుసగా మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకోవాలనే భార‌త క్రికెట్ జ‌ట్టు ఆశలపై పెద్ద దెబ్బప‌డింది. నాలుగో టెస్టులో ఐదో రోజు ఆస్ట్రేలియా ఉంచిన‌ 340 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్ర‌య‌త్నంలో భార‌త జ‌ట్టు 155 పరుగులకే ఆలౌటైంది.

India vs Australia Test

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్.. మూడో స్థానంలోకి ప‌డిపోయిన భార‌త్

మెల్ బోర్న్ లో భారీ టార్గెట్ ను అందుకునే క్ర‌మంలో స్టార్ ప్లేయ‌ర్లు రాణించ‌క‌పోవ‌డంతో భార‌త్ 155 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. పరుగుల వేటలో యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో పాట్ కమిన్స్ (3/28 వికెట్లు), స్కాట్ బోలాండ్ (3/39 వికెట్లు) ఇద్ద‌రు క‌లిసి ఆరు వికెట్లు తీశారు. నాథన్ లియాన్ 2/37 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ చెరోఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు. 

ఇక జనవరి 3 నుండి జనవరి 7 వరకు సిడ్నీలో జరిగే ఐదవ, ఈ సిరీస్ లో చివరి టెస్ట్‌కు ముందు మెల్ బోర్న్ టెస్టు గెలుపు ఆస్ట్రేలియాను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. దీంతో ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ రేసులో ఆస్ట్రేలియా 61.46 పాయింట్ల శాతం (PCT)తో రెండవ స్థానంలో కొనసాగుతుండగా, భారత జ‌ట్టు మూడవ స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా PCT 52.78కి పడిపోయింది.


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ కు చేరిన సౌతాఫ్రికా 

సెంచూరియన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో గెలుపొందడంతో జూన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో తమ స్థానాన్ని ప‌దిలం చేసుకుంది. అలాగే, MCGలో ఆస్ట్రేలియా విజయంతో రెండో స్థానంలోకి చేరింది. భార‌త జ‌ట్టు మూడో స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత న్యూజిలాండ్, శ్రీలంక‌లు ఉన్నాయి. ఈ రెండో స్థానం కోసం పోటీ ప‌డుతున్న జ‌ట్ల‌లో ఆసీస్ మెరుగైన స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత‌ భార‌త్, శ్రీలంక‌లు కూడా పోటీ ప‌డుతున్నాయి. ఈ మూడు జ‌ట్ల ఛాన్సులు ఎలా ఉన్నాయ‌నే వివ‌రాలు గమ‌నిస్తే.. 

భార‌త క్రికెట్ జ‌ట్టు 

పాయింట్ల శాతం : 52.78; మిగిలిన మ్యాచ్‌లు: 1 vs ఆస్ట్రేలియా

WTC ఫైనల్ పోటీలో నిలవాలంటే భారత్ సిడ్నీలో గెలవాలి. ఒక విజయం భారత్‌ను 55.26 పాయింట్ల శాతానికి తీసుకువెళుతుంది. దాంతో పాటు శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ ల‌ను డ్రా చేసుకుంటే భార‌త్ తో సమంగా ఉంటుంది. అయితే, డ‌బ్ల్యూటీసీ సైకిల్ లో ఎక్కువ సిరీస్ ల‌ను గెలిచిన భార‌త జ‌ట్టుకు బెర్త్ ల‌భిస్తుంది. ఒక వేళ ఆస్ట్రేలియా 1-0తో ఓడిపోతే, వారు 53.51 పాయింట్ల శాతానికి ప‌డిపోతారు.శ్రీలంక 48.72 పాయింట్ల‌కు చేరుతుంది. సిడ్నీ టెస్టు ఓడిపోయినా లేదా డ్రా చేసుకున్న భార‌త్  పాయింట్ల శాతం 51.75కి పడిపోతుంది. శ్రీలంక సిరీస్ లో ఆసీస్ రెండు మ్యాచ్ ల‌ను డ్రా చేసుకున్నా, ఒక్క‌టి గెలిచినా WTC ఫైనల్ రేసు నుండి భార‌త్ ఔట్ అవుతుంది. ఆసీస్ రెండ్ మ్యాచ్ లు ఓడిపోతే భార‌త్ కు అవ‌కాశాలుంటాయి.

ఆస్ట్రేలియా, శ్రీలంక‌

ఆసీస్ పాయింట్ల శాతం : 61.46, మిగిలిన మ్యాచ్‌లు: 3 (భారత్ తో 1, శ్రీలంక‌తో 2) 

శ్రీలంక పాయింట్ల‌ శాతం : 45.45; మిగిలిన మ్యాచ్‌లు: 2 vs ఆస్ట్రేలియా

ఒకవేళ ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టులో భారత్ పై గెలిస్తే శ్రీలంకతో జ‌రిగే మ్యాచ్ ల‌తో సంబంధం లేకుండా డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియా సిడ్నీలో గెలిచినా, శ్రీలంకలో జరగబోయే సిరీస్‌లో రెండు టెస్టుల్లోనూ ఓడిపోతే, వారు 57.02 శాతం పాయింట్ల‌తో ఉంటారు. ఇదే స‌మ‌యంలో భారత్ 50, శ్రీలంక 53.85 పాయింట్లు ఉంటాయి.

సిడ్నీ టెస్టును డ్రా చేస్తే భార‌త్ పై పైచేయి అవుతుంది కానీ, డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ బెర్త్ క‌న్ఫార్మ్ కాదు. శ్రీలంక తో జ‌రిగే మ్యాచ్ లు డిసైడ్ చేస్తాయి. ఒకవేళ ఆస్ట్రేలియా సిడ్నీలో మ్యాచ్ ను డ్రా  చేసుకుని, శ్రీలంకలో రెండు టెస్టులు ఓడిపోతే ఆస్ట్రేలియా పాయింట్ల శాతం 53.51గా అవుతుంది. శ్రీలంక 53.85కి చేరుకుంటుంది. అప్పుడు నేరుగా శ్రీలంక సెకండ్ బెర్త్ ను నిలుపుకుంటుంది. 

సిడ్నీలో ఆస్ట్రేలియా ఓడిపోతే శ్రీలంక‌తో ఒక మ్యాచ్ గెలిచినా అర్హ‌త సాధిస్తుంది. అయితే, సిడ్నీలో ఓడిన తర్వాత శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు టెస్టులను డ్రా చేసుకుంటే, భారత్-ఆస్ట్రేలియా 55.26 పాయింట్ల శాతంలో సమంగా ఉంటాయి. అయితే ఈ డ‌బ్ల్యూటీసీ టోర్నీలో ఎక్కువ‌ సిరీస్‌లు గెలిచిన ఆధారంగా భారత్ అర్హత సాధిస్తుంది.

Latest Videos

click me!