రికార్డుల రారాజును ఊరిస్తున్న సచిన్, ద్రావిడ్ ఘనతలు.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ల్ బ్రేక్ చేసేందుకు కోహ్లీ రెడీ..

First Published Jun 7, 2023, 1:53 PM IST

WTC Final 2023: రికార్డులు రారాజు విరాట్ కోహ్లీ  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో పలు రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్ లో   విరాట్.. సచిన్‌తో పాటు ద్రావిడ్, పాంటింగ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 

టీమిండియా   మాజీ సారథి, రన్ మిషీన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేం కాదు. తాజాగా  ఓవల్ వేదికగా  నేటి నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ  పైనల్స్ లో కూడా  కోహ్లీ పలు రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.  ఈ మ్యాచ్ లో గనక కోహ్లీ  ఓ మోస్తారుగా ఆడినా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్,  టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో పాటు ఆసీస్ దిగ్గజం   రికీ పాంటింగ్ ల రికార్డులు బ్రేక్ అవుతాయి.  

డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కోహ్లీ  గనక 38 పరుగులు చేస్తే ఐసీసీ నాకౌట్స్ లో  అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలుస్తాడు. ఈ క్రమంలో అతడు సచిన్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు. సచిన్.. 15 నాకౌట్ మ్యాచ్ లలో 657 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లీ.. 15 ఇన్నింగ్స్ లలో  620 రన్స్ సాధించాడు. 

ఇదే మ్యాచ్ లో కోహ్లీ గనక 112 పరుగులు చేస్తే రికీ పాంటింగ్ రికార్డు కూడా బ్రేక్  అవుతంది. పాంటిగ్.. 18 ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో 731 పరుగులు  చేసి అందరికంటే ముందున్నాడు.  రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 120 పరుగులు చేసినా కోహ్లీ.. పాంటింగ్ రికార్డును అధిగమించే  అవకాశాలుంటాయి. 

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా కోహ్లీ 73 పరుగులు చేస్తే సచిన్ తో పాటు ద్రావిడ్ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి.  ఇంగ్లాండ్  లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో  రాహుల్ ద్రావిడ్ 46 మ్యాచ్ లలో 2,645 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో సచిన్.. 43 మ్యాచ్ లలో 2,626 రన్స్ చేశాడు. 

ఈ జాబితాలో కోహ్లీ.. 56 మ్యాచ్ లలో 2,574 పరుగులు చేశాడు.  మరో 72 పరుగులు చేస్తే కోహ్లీ.. సచిన్, ద్రావిడ్ ల రికార్డు చెరిపేసి ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. 

ఈ మ్యాచ్‌ లో కోహ్లీ మరో 21 పరుగులు చేస్తే ఆసీస్ పై టెస్టులలో 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు కోహ్లీ ఆసీస్ పై 24 టెస్టులలో 1,979 రన్స్ చేశాడు.  అంతేగాక  55 పరుగులు చేస్తే ఓవరాల్ గా ఆసీస్ పై అన్ని ఫార్మాట్లలోనూ 5 వేల పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో సచిన్ (6,707 రన్స్) అందరికంటే ముందున్నాడు. 

click me!