WTC Final 2023: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్ లో ఉండగా అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తున్నది.
మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా - ఇండియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలుకానుంది. అయితే ఈ మెగా ఫైనల్ లో భారత జట్టు వికెట్ కీపర్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
27
డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు గాను టీమిండియా.. ఇషాన్ కిషన్ తో పాటు కెఎస్ భరత్ ను కూడా ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే.
37
ఒకవైపు ఇషాన్.. తనకు టీమ్ లో చోటు దక్కుతుందా..? లేదా..? అనే కన్ఫ్యూజన్ లో ఉండగా అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతి పోగొడుతున్నది.
47
మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ దుస్తుల్లో కూడా అదితి తన అందంతో ఆకర్షిస్తున్నది. 2017 లో మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ నెగ్గిన అదితి.. మోడ్రన్ దుస్తులతో పాటు ఎథ్నిక్ వేర్స్ లో కూడా అందాలు ఆరబోస్తున్నది.
57
మోడల్ గా కెరీర్ ఆరంభించిన అదితి.. పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ లలో కూడా దర్శనమిచ్చింది. ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు వెళ్లిన ఫోటోలు కూడా గతంలో వైరల్ గా మారాయి.
67
2017 లో ఫెమినా మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ తో పాటు ఆమె మిస్ దివా సుప్రానేషనల్ 2018 కూడా నెగ్గింది. దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్ అందాల పోటీలలో కూడా భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది.
77
Image: Aditi Hundia/Instagram
మోడ్రన్ డ్రెసెస్ తో పాటు చుడీదార్, గాగ్రా చోళీ లే గాక చీర కట్టినా ఏదో ఒక రూపంలో తన గ్లామర్ సొగసులను పంచుతూనే ఉంది అదితి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.