ఐపీఎల్ కావాలా? ఐసీసీ ట్రోఫీలు కావాలా? తేల్చుకోండి... బీసీసీఐ, టీమిండియాపై రవిశాస్త్రి కామెంట్స్...

Published : Jun 10, 2023, 05:35 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కలిపి 60 పరుగులు కూడా చేయలేకపోయారు...

PREV
17
ఐపీఎల్ కావాలా? ఐసీసీ ట్రోఫీలు కావాలా? తేల్చుకోండి... బీసీసీఐ, టీమిండియాపై రవిశాస్త్రి కామెంట్స్...
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరుకుంది టీమిండియా. అక్కడి వాతావరణానికి, పరిస్థితులకు అలవాటు పడడానికి చాలా సమయమే పట్టింది...
 

27

గత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 సమయంలో టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి...

37

‘బీసీసీఐకి ఏది ముఖ్యమో, ఏది అవసరమో దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ప్రాధాన్యం దేనికి? ఐపీఎల్ కా? లేక టీమిండియాకా? దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోండి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఇక్కడ కుదరదు...
 

47

ఫ్రాంఛైజీ క్రికెటే ముఖ్యం అనుకుంటే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఐసీసీ టైటిల్స్‌పై ఆశలు వదిలేసుకోండి. ఒకవేళ ఇదే ముఖ్యమనుకుంటే ఐపీఎల్‌లో సమూల మార్పులు చేయండి, బీసీసీఐ చెబితే ఫ్రాంఛైజీలు వినవా...

57

టీమిండియాకి ఆడే ప్లేయర్లు, ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే రెండు నెలల బిజీ క్రికెట్ ఆడిన తర్వాత వారం రోజుల గ్యాప్‌లో ఐసీసీ ఫైనల్ ఆడాలంటే... అయ్యే పని కాదు...
 

67

బీసీసీఐ, దేశంలో క్రికెట్‌ని మొత్తం నియంత్రిస్తోంది. ఐసీసీ ట్రోఫీలు ఆడే ప్లేయర్లకు కావాల్సినంత రెస్ట్ దొరికిలే చర్యలు తీసుకోవాలి, ఫ్రాంఛైజీలతో మాట్లాడాలి.  ఎందుకంటే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు... 

77

ఇండియా, ఐసీసీ టోర్నీల్లో ఫెయిలైన ప్రతీసారీ ఐపీఎల్‌వైపే వేళ్లు వెళ్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ దృష్టి పెట్టాల్సిన అవసరం కచ్ఛితంగా ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి... 
 

click me!

Recommended Stories