ఫిబ్రవరిలో వేలం! టీ20 వరల్డ్ కప్ ముగియగానే ఉమెన్స్ ఐపీఎల్.... ఐపీఎల్‌కి స్టార్ అయ్యేలోపు...

First Published Jan 26, 2023, 3:10 PM IST

మహిళా క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఐపీఎల్ రాకతో టీమిండియాలో, ప్రపంచ క్రికెట్‌లో ఎన్ని మార్పులు వచ్చాయో తెలిసిందే. మెన్స్ ఐపీఎల్ వచ్చిన 16 ఏళ్లకు ఉమెన్స్ ఐపీఎల్‌ని ప్రారంభించబోతోంది బీసీసీఐ. ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పేరుతో తొలి సీజన్‌లో పాల్గొనే ఐదు జట్లను కూడా రివీల్ చేసింది బీసీసీఐ...

అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, ముంబై జట్లు తొలి డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీల ద్వారా దాదాపు రూ.4700 కోట్ల రూపాయలు, బీసీసీఐ ఖజానాలో వచ్చి చేరింది. మెన్స్ ఐపీఎల్ తర్వాత ఇదే ఖరీదైన క్రికెట్ లీగ్...

Smriti Mandhana-Harmanpreet Kaur

ఇప్పటికే ఉమెన్స్ ఐపీఎల్‌కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో మహిళల ప్రీమియర్ లీగ్‌కి సంబంధించిన వేలం పాట జరగనుంది. మెన్స్ ఐపీఎల్‌ ఆరంభమయ్యేలోపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ముగించాలని భావిస్తోంది బీసీసీఐ...

వచ్చే నెల 10 నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ, 26న ముగుస్తుంది. దీంతో మహిళల టీ20 వరల్డ్ కప్‌కీ, మెన్స్ ఐపీఎల్‌కీ మధ్య గ్యాప్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది భారత క్రికెట్ బోర్డు...

ఈ ఏడాది మార్చి 30న మెన్స్ ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మార్చి 4న మహిళల ప్రీమియర్ లీగ్‌ని మొదలెట్టి, మార్చి 24 లేదా 25 తేదీల్లో ముగించేలా షెడ్యూల్‌ని రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది...

Smriti Mandhana BBL

ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొనే తొలి సీజన్‌‌ని ముంబై, పూణే, నాగ్‌పూర్ వేదికలుగా నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఫ్రాంఛైజీలకు రూ.12 నుంచి 15 కోట్ల పర్సు వాల్యూ ఉండనుంది. ఈ మొత్తంతో 15 నుంచి 18 ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది..

Harmanpreet Kaur and Smriti Mandhana

మెన్స్ ఐపీఎల్‌ మాదిరిగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రూ.10, రూ.20, రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో మహిళా క్రికెటర్లు వేలంలోకి రాబోతున్నారు. ఇప్పటికే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులను రూ.951 కోట్ల భారీ ధరకు వయాకాం18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..

click me!