విరాట్ కోహ్లీ ఐదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడు! రోహిత్ ఏడాదికే ఇలా అయిపోయాడు... - కమ్రాన్ అక్మల్...

Published : Jan 26, 2023, 01:55 PM IST

ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ గెలిచి టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ పగ్గాలు రోహిత్‌కి అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఎత్తుగడ టీమిండియాకి అనుకున్న రిజల్ట్ అయితే ఇవ్వలేకపోయింది...

PREV
18
విరాట్ కోహ్లీ ఐదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడు! రోహిత్ ఏడాదికే ఇలా అయిపోయాడు... - కమ్రాన్ అక్మల్...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఏడాదిలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది భారత జట్టు. ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్, గాయాలతో రోహిత్ శర్మ ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

28

బాబర్ ఆజమ్, బ్యాటర్‌గా మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నా.. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కి కావాల్సిన విజయాలు మాత్రం అందించలేకపోతున్నాడు. స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో వైట్ వాష్ అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో వన్డే సిరీస్ కోల్పోయింది...

38

ఈ పరాజయాలతో ఇద్దరు కెప్టెన్ల పాలసీని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది పాక్ క్రికెట్ బోర్డు. వన్డే, టెస్టుల్లో షాన్ మసూద్‌కి కెప్టెన్సీ అప్పగించి, టీ20ల్లో బాబర్ ఆజమ్‌ని కొనసాగించాలని చూస్తోంది... భారత జట్టు కూడా ఇదే ఫార్ములాని అనుసరించాలని అంటున్నాడు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్.. 

48

‘మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు కెప్టెన్లు సరిపోతారు. భారత జట్టు ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ని మార్చాల్సిన పని లేదు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ దగ్గర్లో ఉంది...

58
Image credit: Getty

మార్చాలని అనుకుంటే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాతే మార్చాల్సింది. ఇప్పుడు కొత్త కెప్టెన్‌ని ప్రకటిస్తే, జట్టులో కాస్త అయోమయం క్రియేట్ అవుతుంది. అది టీమ్ వాతావరణాన్ని దెబ్బ తీస్తుంది...

68

వర్క్‌లోడ్ తగ్గించాలంటే రోహిత్ శర్మపై ఉన్న భారాన్ని తగ్గించాల్సిందే. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో టీమ్‌ని నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రోహిత్‌కి ఆ విషయం బాగా తెలిసొచ్చి ఉంటుంది...
 

78
Image credit: PTI

విరాట్ కోహ్లీ ఐదేళ్ల పాటు టీమ్‌ని నడిపించాడు. మూడు ఫార్మాట్లలో దాదాపు ప్రతీ సిరీస్‌లోనూ ఆడాడు. చిన్న టీమ్, పెద్ద టీమ్ అని ఆలోచించలేదు. రోహిత్ శర్మ కనీసం ఒక్క ఏడాది కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు...

88
Virat Kohli-Rohit Sharma

కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ చాలా ప్రెషర్ ఫీలవుతున్నాడు. సెంచరీ చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. సెంచరీ కంటే రోహిత్ శర్మ ముఖంలో మెంటల్ ప్రెషర్ స్పష్టంగా కనిపిస్తోంది.. కనీసం టాస్ గెలిచిన తర్వాత ఏం చెప్పాలో కూడా అతనికి గుర్తు ఉండడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్.. 

Read more Photos on
click me!

Recommended Stories