అది సూర్యలాంటి ప్లేయర్‌కి అవమానం! దాంట్లో ప్లేస్ ఇవ్వాల్సిందే... సురేశ్ రైనా కామెంట్...

First Published Jan 26, 2023, 1:38 PM IST

సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో అదరగొడుతున్న భారత బ్యాటర్. 2022 ఏడాదికి గానూ ఐసీసీ నుంచి టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే అతనికి వన్డేల్లో ఆడపాదడపా అవకాశాలు దక్కుతున్నా, ఇప్పటిదాకా టెస్టు ఎంట్రీ చేసే అవకాశం దక్కలేదు...

suryakumar

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం కల్పించారు సెలక్టర్లు...

suryakumar

రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోని సెలక్టర్లు, సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టు టీమ్‌లో చోటు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మాత్రం టెస్టు టీమ్‌లో సూర్యకి చోటు ఉండాల్సిందేనని అంటున్నాడు...

suryakumar

‘సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న విధానం టాప్ క్లాస్. టీమిండియా ఆడే మూడు ఫార్మాట్లలోనూ అతనికి అవకాశం దక్కాలి. ఇంకా చెప్పాలంటే సూర్య లేకుండా టీమిండియా ఏ ఫార్మాట్ ఆడకూడదు.. అది సూర్యలాంటి ప్లేయర్‌కి అవమానం..

suryakumar

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఓ స్పెషల్ ఇంటెంట్ ఉంటుంది. అతను షాట్ సెలక్షన్ వేరే లెవెల్. నిర్భయంగా ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కోగలడు, గ్రౌండ్‌లో ఏ వైపుకైనా షాట్ కొట్టగలడు...

ముంబై ప్లేయర్లకు రెడ్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో బాగా తెలుసు. వన్డేల్లో అతను కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే సూర్యకి టాపార్డర్‌లో ఆడిస్తే, అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రాబట్టొచ్చు..

suryakumar

సూర్య వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టగల సమర్థుడు... టెస్టుల్లో కుదురుకుంటే త్రిబుల్ సెంచరీ కూడా సాధించగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికటెర్ సురేష్ రైనా...

click me!