WPL 2023 వేలానికి 409ప్లేయర్లు షార్ట్ లిస్ట్... ముహుర్తం ఫిక్స్! ఆ లిస్టులో స్మృతి, హర్మన్‌ప్రీత్...

First Published Feb 8, 2023, 1:31 PM IST

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మహిళా ప్రీమియర్ లీగ్ కోసం దాదాపు 1500 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా వీరిలో 406 మంది షార్ట్ లిస్టు చేయబడ్డారు. 409 మందిలో దాదాపు 90 మంది ప్లేయర్లు మాత్రమే వేలంలో అమ్ముడుపోనున్నారు...

2023, ఫిబ్రవరి 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం జరగనుంది. వేలంల పాల్గొనే 409 మంది ప్లేయర్లలో 246 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ ప్లేయర్లు...

Image credit: Wikimedia Commons

వేలంలో పాల్గొనే ప్లేయర్లలో 202 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా, 199 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు. మరో 8 మంది అసోసియేట్ దేశాల ప్లేయర్లు. ప్రతీ జట్టు వేలంలో అత్యధికంగా 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు. అమ్ముడుపోయే 90 ప్లేయర్లలో అత్యధికంగా 30 మంది ఫారిన్ ప్లేయర్లు ఉంటారు...
 

రూ.50 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరిలో భారత్ నుంచి 24 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా 13 మంది విదేశీ క్రికెటర్లు ఈ విభాగంలో వేలానికి రాబోతున్నారు. రూ.40 లక్షల బేస్ ప్రైజ్‌తో 30 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనబోతున్నారు...

రూ.50 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరిలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు సోఫియా డివైన్, ఎక్లెస్టోన్, గార్నెర్, మాథ్యూ, ఎలిసా పెర్రీ ఉన్నారు. రూ.40 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఇస్మాయిల్, కెర్, తహిళా మెక్‌గ్రాత్, మూనీ, స్కివర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఉన్నారు...

అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 28 మంది ప్లేయర్లు షార్ట్ లిస్ట్ కాగా ఇంగ్లాండ్ నుంచి 27, వెస్టిండీస్ నుంచి 23, న్యూజిలాండ్ నుంచి 19 మంది ప్లేయర్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొనబోతున్నారు.

అలాగే సౌతాఫ్రికా నుంచి 17, శ్రీలంక 15, జింబాబ్వే 11, బంగ్లాదేశ్ 9, ఐర్లాండ్ 6, యూఏఈ నుంచి నలుగురు, థాయ్‌లాండ్, హంగ్‌కాంగ్, నెదర్లాండ్స్, యూఎస్‌ఏ నుంచి ఒక్కొ ప్లేయర్ డబ్ల్యూపీఎల్‌ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...
 

click me!