పిచ్‌ని చూసి ఏడుస్తూ కూర్చుంటారా? ఆడతారా... ఆస్ట్రేలియాకి రోహిత్ శర్మ కౌంటర్...

First Published Feb 8, 2023, 1:02 PM IST

టెస్టు కెప్టెన్‌గా బోర్డర్ గవాస్కర్ 2023 ట్రోఫీలో అసలైన ఛాలెంజ్‌ని ఎదుర్కోబోతున్నాడు రోహిత్ శర్మ. టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలన్నా, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి ఎగబాకలన్నా ఈ టెస్టు సిరీస్ చాలా అవసరం..
 

Image credit: Getty

2004 తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోయి టీమిండియా, గత 20 ఏళ్లల్లో కేవలం రెండే రెండు టెస్టులు ఓడిపోయింది. అయితే స్వదేశంలో టీమిండియా ఓడిన టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకటి, ఇంగ్లాండ్‌పై ఉండడం విశేషం...

Rohit Sharma

నాగ్‌పూర్ టెస్టు ఆరంభానికి ముందు ప్రెస్ మీటింగ్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్...

Image credit: PTI

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు సాలిడ్ మ్యాచులు ఉన్నాయి. ఈ సిరీస్ మాకు ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలుసు. అయితే గెలవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు పక్కాగా తెలుసు. ఏ మ్యాచ్‌కి అయిన ప్రిపరేషనే కీ...

Image credit: PTI

బాగా ప్రిపేర్ అయితే, రిజల్ట్ కావాల్సినట్టుగా వస్తుంది. రెండు సిరీస్‌లు గెలిచాం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవడంపైనే ఫోకస్ పెట్టాం. స్పిన్ పిచ్‌లపై పరుగులు ఎలా చేయాలో కొత్త మార్గాలు కనిపెడుతున్నాం...

Virat Kohli-Shubman Gill

స్పిన్ ఎక్కువగా ఉంటే, ఆడే విధానం మార్చుకోవాలి. సాధారణంగా బ్యాటింగ్ చేయకుండా కౌంటర్ అటాక్‌తో స్వీప్ షాట్స్ ఆడాలి. రేపు ఆడబోయే 22 మంది క్రికెటర్లు కూడా క్వాలిటీ క్రికెట్ ఆడతారు. ఎవరైతే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకే విజయం వరిస్తుంది...

రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం తీరని లోటే. అయితే అతని రోల్‌ని భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏం చేయగలడో అందరికీ తెలుసు...
 

ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మ్యాచ్ సమయంలోనే ఆ విషయం తెలుస్తుంది. నలుగురు స్పిన్నర్లు కూడా క్వాలిటీ స్పిన్నర్లే. అశ్విన్, జడేజా చాలా మ్యాచులు కలిసి ఆడారు. కుల్దీప్, అక్షర్ పటేల్ అవకాశం వచ్చినప్పుడు అదరగొట్టారు...

వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై మాకు క్లారిటీ ఉంది. పిచ్ గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. పిచ్‌ని అలా చూస్తూనే ఏడుస్తూ మాట్లాడేదేనా? ఆడేది ఏమైనా ఉందా... పిచ్‌ని మరీ అంతగా చూడకండి, ఆడండి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

click me!