మహ్మద్ షమీ తింటున్న ప్లేట్‌ లాగి పడేసి తిట్టిన రవిశాస్త్రి... షాకింగ్ విషయాలు బయటపెట్టిన శ్రీధర్...

First Published Feb 8, 2023, 12:27 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఐసీసీ టైటిల్స్ గెలవలేదనే ఒక్క లోపం తప్ప, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో విదేశాల్లోనూ ఘన విజయాలు అందుకుంది టీమిండియా. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌లు గెలిచింది...

Image credit: Getty

సౌతాఫ్రికా టూర్‌లో మాత్రం ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. 2018 సౌతాఫ్రికా టూర్‌లో గట్టి పోటీ ఇచ్చిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా వంటి పేసర్లతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది భారత జట్టు...

అయితే సఫారీ బౌలర్లు, భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన చోట, భారత బౌలర్లు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారు. ఈ కారణంగానే తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా, మూడో టెస్టులో గెలిచి విజయంతో స్వదేశానికి తిరిగి వచ్చింది...
 

‘‘కేప్‌టౌన్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయాం. సెంచూరియన్‌లో మ్యాచ్‌లోనూ ఓడి జోహన్‌బర్గ్‌లో అడుగుపెట్టాం. అప్పటికే సిరీస్ పోయింది. మూడో మ్యాచ్‌లో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా టాస్ ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ...

అయితే పరిస్థితులు బ్యాటింగ్‌కి ఏ మాత్రం అనుకూలంగా లేవు. తొలి టెస్టులో టీమిండియా 187 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ బౌలింగ్ సరిగా వేయలేదు. 12 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చేశాడు...

నాలుగో రోజు కూడా అంతే. టీ బ్రేక్‌కి ముందు భారీగా పరుగులు ఇచ్చేశాడు. వికెట్ తీయలేకపోయాడు. 241 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. షమీ అదేమీ పట్టనట్టుగా మ్యాచ్‌తో తనకి సంబంధం లేనట్టుగా ఓ ప్లేట్‌లో మటన్ కర్రీ వేసుకుని అన్నం తినడం మొదలెట్టాడు...

రవిశాస్త్రి అతన్ని చూడగానే చిర్రెత్తిపోయాడు. షమీ ముందున్న ప్లేట్ లాగి... ‘అక్కడ మ్యాచ్ పోయేలా ఉంది. నువ్వు ఇక్కడ మటన్ తింటున్నావా? నీ ఆకలి, ఈ తిండితోనే నిండుతుందా? వికెట్లు తీసేది ఏమైనా ఉందా...’ అంటూ అరిచేశాడు రవిశాస్త్రి...

దానికి మహ్మద్ షమీ మెల్లిగా... ‘హా.. హా... ఇక్కడ తింటాను. అక్కడ కూడా తింటాను... ’ అన్నాడు. సిరీస్ పోయిందనే ఫ్రస్టేషన్‌ రవిశాస్త్రిలో కనిపించింది. అయితే రవిశాస్త్రి తిట్టిన తర్వాత మహ్మద్ షమీ, డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి వెళ్లిపోయాడు...

రవిశాస్త్రి, షమీని పక్కకి తీసుకెళ్లి, ‘నువ్వు నాతో అన్న మాటలు గుర్తున్నాయిగా...’ అని మళ్లీ అడిగాడు. ఆ మాటలు షమీలో ఎంత కసి రేపాయో ఏమో... అతను అదిరిపోయే బౌలింగ్ వేశాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు... షమీ ఇన్నింగ్స్ కారణంగా జోహన్‌బర్గ్‌లో 63 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది...
 

ravi shastri with Anil kumble

మ్యాచ్ తర్వాత షమీ మళ్లీ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చాడు. ‘హా... నాకు ఇలా కోపం తెప్పించండి. నన్ను బాగా తిట్టండి. అప్పుడే ఇలా ఆడతానేమో...’ అని రవిశాస్త్రితో అన్నాడు... ఆ మాటలకు అందరూ నవ్వేశారు...’’ అంటూ రాసుకొచ్చాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.. 

click me!