నేడే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం... టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో ఈ భారత ప్లేయర్లకు భారీ డిమాండ్...

Published : Feb 13, 2023, 09:35 AM IST

ఐపీఎల్ వేలానికి ఎంత క్రేజ్ ఉంటుందో మొట్టమొదటిసారి జరగబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి కూడా అంతే క్రేజ్ వచ్చింది. నిజానికి మొదటి మెన్స్ ఐపీఎల్ వేలం కంటే ఎక్కువే, ఉమెన్స్ ఐపీఎల్‌ వేలంపై డిస్కర్షన్ జరుగుతోంది...  

PREV
17
నేడే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం... టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో ఈ భారత ప్లేయర్లకు భారీ డిమాండ్...

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి 13, సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రారంభం కానుంది. ఈ వేలాన్ని జియో సినిమా, జియో టీవీ మొబైల్ యాప్‌ల్లో ఉచితంగా వీక్షించవచ్చు...

27
Image credit: Getty

ఐదు ఫ్రాంఛైజీలు, రూ.12 కోట్ల పర్సు వాల్యూతో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొనబోతున్నాయి. మొత్తంగా 409 మంది ప్లేయర్లు, 90 స్లాట్స్ కోసం పోటీపడబోతున్నాయి. సరిగ్గా డబ్ల్యూపీఎల్ వేలానికి ముందు రోజు టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది...

37

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు ఈ వేలానికి భారీ డిమాండ్ ఉండడం గ్యారెంటీ. వీరితో పాటు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్ డైనమైట్ జెమీమా రోడ్రిగ్స్.. భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది...

47
Jemimah Rodrigues

బిగ్‌బాష్ లీగ్‌ (ఉమెన్స్)లో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్, పాక్‌పై 38 బంతుల్లో 8 ఫోర్లతో 53 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచింది. వన్‌డౌన్‌లో వచ్చి, ఆఖరి వరకూ క్రీజులో నిలిచి మ్యాచ్‌ని ముగించింది... జెమీమా రోడ్రిగ్స్‌కి రూ.2- 3.5 కోట్ల వరకూ ధర పలకవచ్చని అంచనా...

57
Indian Women's Cricket Team

అలాగే యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసింది. చేయాల్సిన రన్ రేట్ 10 దాటినప్పుడు రిచా ఘోష్ బౌండరీలు బాది, జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రెషర్ పెరగకుండా చేసింది. అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లోనూ సభ్యురాలిగా ఉన్న రిచా ఘోష్ రూ.2 కోట్లకు పైగా ధర దక్కించుకోవడం గ్యారెంటీ...

67

4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన రాధా యాదవ్‌తో పాటు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్‌లకు మంచి డిమాండ్ ఉంది. సీనియర్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌ కూడా మంచి ధర దక్కించుకోవచ్చు...
 

77

యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మతో పాటు యషికా భాటియా, హర్లీన్ డియోల్ మంచి ధర దక్కించుకోవడం గ్యారెంటీ. వీరితో పాటు అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్వేతా సెహ్రావత్, పర్శవీ చోప్రాలకు మంచి డిమాండ్ ఉండవచ్చు.. 

click me!

Recommended Stories