టీమిండియాకి ‘గబ్బా’గా మారిన ఢిల్లీ... 36 ఏళ్లుగా ఒక్క టెస్టు కూడా ఓడని భారత్! రికార్డులకు కేరాఫ్‌గా..

Published : Feb 12, 2023, 07:41 PM IST

గబ్బా... ఆస్ట్రేలియాకి కంచుకోట. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు వరకూ ఆస్ట్రేలియా, బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టీమిండియాకి కూడా అలాంటి గబ్బా ఒకటుంది. అదే దేశరాజధాని ఢిల్లీ...

PREV
18
టీమిండియాకి ‘గబ్బా’గా మారిన ఢిల్లీ... 36 ఏళ్లుగా ఒక్క టెస్టు కూడా ఓడని భారత్! రికార్డులకు కేరాఫ్‌గా..
Indian Cricket Team

గబ్బా... ఆస్ట్రేలియాకి కంచుకోట. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు వరకూ ఆస్ట్రేలియా, బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టీమిండియాకి కూడా అలాంటి గబ్బా ఒకటుంది. అదే దేశరాజధాని ఢిల్లీ...

28

నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాని ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, రెండో టెస్టు కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ఢిల్లిలోనీ ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు జరగనుంది. దీనికి ఈ మధ్యనే అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం...
 

38
Image credit: PTI

1948, నవంబర్ 10న ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. 2009లో శ్రీలంక, ఇండియా మధ్య వన్డే మ్యాచ్‌ డేంజరస్ పిచ్ కారణంగా క్యాన్సిల్ అయ్యింది. బంతి అన్యూహ్యంగా బంతి అవుతూ బ్యాటర్లకు ముఖాలకు తగులుతుండడంతో ఈ పిచ్‌పై 12 నెలల బ్యాన్ వేసింది ఐసీసీ...

48
Image credit: PTI

2017లో చివరిగా శ్రీలంకతో టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా, 36 ఏళ్లుగా ఇక్కడ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా ఢిల్లీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకి ఘనమైన రికార్డులు ఉన్నాయి. 1952లో పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌లో హేము అధికారి, గులాం అహ్మద్ కలిసి 9వ వికెట్‌కి 111 పరుగలు జోడించారు. అప్పటికి 9వ వికెట్‌కి ఇదే వరల్డ్ రికార్డు...

58

1969-70 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో టెస్టులో బిషన్ సింగ్ భేడీ, ఎర్రాపల్లి ప్రసన్న కలిసి 18 వికెట్లు తీశారు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకి 7 వికెట్ల ఘన విజయం అందించారు.  1983లో సునీల్ గవాస్కర్, టెస్టుల్లో 29వ సెంచరీ చేసి, డాన్ బ్రాడ్‌మెన్ రికార్డును సమం చేసింది ఇక్కడే...
 

68

1999లో ఇదే స్టేడియంలో అనిల్ కుంబ్లే, పాకిస్తాన్‌తో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అనిల్ కుంబ్లే, ఈ స్టేడియంలో 58 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 32 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ 27 పరుగులు చేశాడు...

78

2005లో సచిన్ టెండూల్కర్, శ్రీలంకపై సెంచరీ (35వ సెంచరీ) చేసి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసింది కూడా ఇదే స్టేడియంలో.. 

88

ఇప్పుడు టెస్టుల్లో పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ, అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 2017 డిసెంబర్ 2న ఇదే స్టేడియంలో 243 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... ఇదే ఈ స్టేడియంలో జరిగిన ఆఖరి టెస్టు కూడా..

Read more Photos on
click me!

Recommended Stories