పాపం శ్రేయాస్ అయ్యర్... టీమిండియా కెప్టెన్ కావాల్సిన వాడు, కనీసం వైస్ కెప్టెన్ కూడా కాలేక...

Published : Jul 18, 2022, 03:55 PM IST

శ్రేయాస్ అయ్యర్... టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా అందరికంటే ముందు వరుసలో నిలిచిన వ్యక్తి. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు తర్వాతి సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పుడు అసలు కెప్టెన్సీ రేసులోనే లేడు...

PREV
19
పాపం శ్రేయాస్ అయ్యర్... టీమిండియా కెప్టెన్ కావాల్సిన వాడు, కనీసం వైస్ కెప్టెన్ కూడా కాలేక...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరి మెప్పించాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి లెజెండరీ కెప్టెన్లు కూడా ఫైనల్ చేర్చలేకపోయిన ఢిల్లీని మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.. 

29
Image credit: PTI

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్, దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ గాయం శ్రేయాస్ అయ్యర్ కెరీర్ గ్రాఫ్‌నే పూర్తిగా మార్చి పడేసింది...

39
Image credit: PTI

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రిషబ్ పంత్...

49
Image credit: PTI

ఈ కెప్టెన్సీ మార్పు కారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని వీడి... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్‌‌తో మెప్పించినా టీమ్ మేనేజ్‌మెంట్ అనవసర ప్రయోగాల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేదు కేకేఆర్...

59

గాయం నుంచి కోలుకున్నా సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తుండడంతో తుది జట్టులో చోటు దక్కించుకోవడం శ్రేయాస్ అయ్యర్‌కి కష్టంగా మారింది.. అయ్యర్, తుది జట్టులోకి రావాలంటే ఏ ప్లేయర్ అయినా గాయపడాల్సిన పరిస్థితి...

69
Shreyas Iyer

సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తుదిజట్టులోకి వచ్చిన అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌లోకి వచ్చినా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు...

79

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడని అనుకున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పుడు కనీసం వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకోలేకపోతున్నాడు. అయ్యర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రిషబ్ పంత్‌తో పాటు హార్ధిక్ పాండ్యా కూడా టీమిండియాకి కెప్టెన్సీ చేసేశారు...

89

వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా రెస్ట్ తీసుకున్నా శ్రేయాస్ అయ్యర్‌కి కెప్టెన్సీ ఇచ్చే ఆలోచన చేయలేదు బీసీసీఐ... శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ఎంచుకున్న బీసీసీఐ, రవీంద్ర జడేజాని వైస్ కెప్టెన్‌గా నియమించింది...

99

ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్ లేవని విమర్శలు ఎదుర్కొన్న కెఎల్ రాహుల్‌పై చూపించిన నమ్మకం, ఫ్యూచర్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్‌పై బీసీసీఐ చూపించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories