జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం... నీ వయసైపోయిందంటూ...

First Published Aug 15, 2021, 6:11 PM IST

భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతూ, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్‌ను టీమిండియా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. నిన్న జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లతో అండర్సన్ బాడీని టార్గెట్ చేస్తే... నేడు విరాట్ కోహ్లీ ఘాటైన మాటలతో అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు...

మూడో రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జేమ్స్ అండర్సన్‌ను జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. 

తొలి బంతినే అండర్సన్ హెల్మెట్‌కేసి కొట్టిన బుమ్రా, ఆ తర్వాత కూడా వరుస బంతుల్లో అతని శరీరాన్ని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశాడు. అండర్సన్ అవుటైన తర్వాత పెవిలియన్‌కి వెళ్తున్న సమయలో జస్ప్రిత్ బుమ్రాపై కోపం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్...

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్‌కి వచ్చిన జేమ్స్ అండర్సన్, బాల్ వేసిన తర్వాత ఏదో అంటూ వెళ్లాడు. అయితే అండర్సన్ సెడ్జింగ్‌కి వెంటనే స్పందించిన విరాట్ కోహ్లీ... ‘ఏంటి? ఏదో వాగుతున్నావ్... నిన్న బుమ్రాతో వాగినట్టు... వెళ్లు, వెళ్లి బౌలింగ్ చెయ్...’ అంటూ సమాధానం ఇచ్చాడు. 

దానికి అండర్సన్ మరోసారి... ఏదో బూతు అన్నాడు... దాంతో విరాట్ కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది... ‘ఇది నీ బ్యాక్‌యార్డ్ కాదు... పిచ్చుకలా కిచకిచమంటున్నావ్... నీ వయసు పెరిగిపోయింది కదా... ఇంకేం చేస్తావ్...’ అంటూ ఘాటుగా సమాధానం ఇవ్వడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించింది... 

కోహ్లీ ఆన్సర్‌కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వెళ్లిపోయాడు అండర్సన్... ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్ మధ్య మంచి బాటిల్ ఉంటుందని ఆశించారు క్రికెట్ ఫ్యాన్స్. 

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో 56 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా. 

click me!