INDvsENG 2nd Test: విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Aug 15, 2021, 05:36 PM IST

లార్డ్స్ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నాలుగు ఫోర్లతో మంచి దూకుడు మీద ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు... లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది...

PREV
17
INDvsENG 2nd Test: విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

మూడో రోజు ఆఖరి బంతిని ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 12 ఓవర్లలో 27 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది...

27

30 బంతుల్లో 5 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు...

37

ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాది జోరు మీద ఉన్నట్టు కనిపించిన రోహిత్ శర్మ... మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కి ప్రయత్నించి, మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

47

చూడచక్కని షాట్‌తో ఖాతా తెరవడంతో పాటు భారత జట్టుకి ఆధిక్యాన్ని అందించిన విరాట్ కోహ్లీ 31 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

57
=

టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా మరోసారి తన జిడ్డు ఆటను కొనసాగిస్తున్నాడు. 35 బంతుల తర్వాత సింగిల్ తీసి ఖాతా తెరిచిన పూజారా... 46 బంతుల్లో కేవలం 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

67

విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. గత 49 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు విరాట్...

77

ఈ మ్యాచ్‌ను నిలుపుకోవాలంటే కనీసం ఈ రోజులో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది భారత జట్టు...  తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్, సెంచరీతో ఆదుకున్న కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరారు, విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు...  వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే రాణిస్తేనే... 270+ పరుగులు చేయగలుగుతుంది...

click me!

Recommended Stories