వుమన్స్ ప్రీమియర్ లీగ్: బెంగళూరు టీమ్‌ కోసం 9 బిడ్స్... చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా లేకుండానే మొదటి సీజన్...

First Published Jan 25, 2023, 4:58 PM IST

ఎప్పుడెప్పుడా అని మహిళా క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. వుమెన్స్ ఐపీఎల్‌ని ఐదు టీమ్స్‌తో నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) పేరుతో సాగే ఈ టీ20 ఫ్రాంఛైజీ లీగ్‌ మొదటి సీజన్‌లో ఐదు జట్లు పోటీపడబోతున్నాయి. 

అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏకంగా రూ.1289 కోట్లు చెల్లించి, అహ్మదాబాద్ టీమ్‌ని సొంతం చేసుకోగా రిలయెన్స్ ఫౌండేషన్‌కి చెందిన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.912.99 కోట్లకు ముంబై జట్టును కొనుగోలు చేసింది...

Image credit: PTI

బెంగళూరు టీమ్ కోసం ఏకంగా 9 కంపెనీలు బిడ్ వేశాయి. ఇందులో 901 కోట్ల రూపాయల బిడ్ వేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీని దక్కించుకుంది...

Smriti Mandhana-Harmanpreet Kaur

జెఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ టీమ్‌ని రూ.810 కోట్లకు దక్కించుకోగా, కప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్నో జట్టును రూ.757 కోట్లకు దక్కించుకుంది...

అయితే తొలి సీజన్‌లో చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా నగరాల పేర్లతో టీమ్స్ లేకపోవడం ఆయా జట్ల అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. మెన్స్ ఐపీఎల్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో చెన్నై పేరు ముందుగా ఉంటుంది..
 

Shafali Verma

అయితే ఆర్థిక అంశాల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి దూరంగా ఉంది. హైదరాబాద్, కోల్‌కత్తా ఫ్రాంఛైజీలు, బిడ్ వేసినా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్లను దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యాయి...

ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్, కోల్‌కత్తా సిటీ పేరుతో ఫ్రాంఛైజీ కొనుగోలుకి తీవ్రంగా ప్రయత్నించినా అతనికి విజయం దక్కలేదు. అలాగే మెన్స్ టీమ్స్‌ ఉన్న పంజాబ్, రాజస్థాన్ కూడా వుమెన్స్ ఐపీఎల్ టీమ్స్‌ని దక్కించుకోవడంలో సక్సెస్ సాధించలేకపోయాయి..

click me!