సిరాజ్ మియా కమాల్ షో... ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా మనోడే! కోహ్లీని దాటేసిన శుబ్‌మన్ గిల్...

First Published Jan 25, 2023, 3:26 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చారు.  ఈ సిరీస్‌లో 2 వన్డేలు ఆడి 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, 3.5 ఎకానమీతో అదరగొట్టాడు..

Image credit: PTI

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో 9 వికెట్లు తీసి, హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు మహ్మద్ సిరాజ్. వరుసగా రెండు వన్డే సిరీసుల్లో చూపించిన సెన్సేషనల్ పర్ఫామెన్స్ కారణంగా జోష్ హజల్‌వుల్, ట్రెంట్ బౌల్ట్‌ని వెనక్కి నెట్టిన సిరాజ్ మియా... ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా అవతరించాడు...
 

Image credit: PTI

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో ఓ డబుల్ సెంచరీ, మరో సెంచరీతో 360 పరుగులు చేసి అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. డబుల్ సెంచరీ తర్వాత టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన గిల్, మూడో వన్డేలో సెంచరీతో టాప్ 6లోకి వచ్చేశాడు...

Image credit: PTI

మూడు వన్డేల సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, మళ్లీ ఏడో స్థానానికి పడిపోగా శుబ్‌మన్ గిల్, టీమిండియా నుంచి టాప్ 6లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. మూడో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ, మళ్లీ టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చి 9వ ర్యాంకులో నిలిచాడు...


వన్డే సిరీస్ విజయంతో టీమిండియా నెం.1 వన్డే టీమ్‌గా, నెం.1 టీ20 టీమ్‌గా కొనసాగుతోంది. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ నెం.1 బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. టెస్టుల్లో రవీంద్ర జడేజా నెం.1 ఆల్‌రౌండర్‌గా టాప్‌లో ఉన్నాడు... అశ్విన్ నెం.2లో ఉన్నాడు. 

వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ గెలిస్తే టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత జట్టు నెం.1 స్థానాన్ని దక్కించుకుంటుంది.  టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా మూడో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు...

click me!