పేరుకే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్... చక్రం తిప్పేదంతా పురుషులే! ఈ మాత్రం దానికి ఇంత హడావుడి దేనికో...

First Published Jan 29, 2023, 3:57 PM IST

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెడుతున్న లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. 16 ఏళ్ల క్రితం మెన్స్ ఐపీఎల్‌ ప్రవేశపెట్టి, క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా అవతరించింది భారత క్రికెట్ బోర్డు. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మహిళా క్రికెట్ గతిని మార్చేస్తుందని భావిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
 

పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే వార్షిక వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. లిస్టు A+ లెవెల్ దక్కించుకున్న పురుష క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తున్న బీసీసీఐ... మహిళా క్రికెటర్లకు అత్యధికంగా ఇచ్చే మొత్తం రూ.1 కోటి మాత్రమే...
 

Smriti Mandhana-Harmanpreet Kaur

గత ఏడాది చివర్లోనే పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో తారతమ్యాలు ఉన్నా, మ్యాచు ఫీజు విషయంలో మాత్రం ఎలాంటి వివక్ష చూపించడం లేదు బీసీసీఐ...

Smriti Mandhana BBL

మహిళల చూపిస్తున్న వివక్షపై ఎన్ని విమర్శలు వచ్చినా, మహిళా క్రికెట్ నుంచి  రూపాయి ఆదాయం రావడం లేదని, వాళ్లకి ఇచ్చే ఈ డబ్బులు కూడా పురుషుల క్రికెట్ ద్వారా వస్తున్నాయని చెబుతూ వచ్చింది బీసీసీఐ. అయితే ఇప్పుడు సీన్ మారింది..

భారత మహిళా జట్టు ఆడే మ్యాచులకు కూడా వేల సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతున్నారు. అదీకాకుండా పురుషుల జట్టు కంటే భారత మహిళా జట్టు బెటర్ పర్ఫామెన్స్ ఇస్తోంది. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా బీసీసీఐకి మొదటి సీజన్ నుంచే దాదాపు రూ.5500+ కోట్ల ఆదాయం వచ్చి పడింది...

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులను రూ.951 కోట్లకు విక్రయించిన బీసీసీఐ, ఐదు ఫ్రాంఛైజీల బిడ్డింగ్ ద్వారా రూ.4669.5 కోట్లు ఖాతాలో వేసుకుంది. మహిళా క్రికెట్ ద్వారా ఇంత ఆదాయం వస్తుందని బీసీసీఐ ఊహించలేకపోయింది...
 

ఉమెన్స్ క్రికెట్‌కి ఇంత క్రేజ్ ఉందని తెలిస్తే, బీసీసీఐ ఎప్పుడో ఆడాళ్ల కోసం ఐపీఎల్ తీసుకొచ్చేది. అయితే పేరుకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయినా అక్కడ చక్రం తిప్పుతున్నది మాత్రం మొత్తం మగాళ్లే...

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ గవర్నింగ్ కౌన్సిల్‌కి అరుణ్ సింగ్ ధుమాల్ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా, బీసీసీఐ ట్రెజరర్ అసిష్ సేలర్, ప్రజ్ఞాన్ ఓజా, సీఎం సేన్, అవిషేన్ దాల్మియా సభ్యులుగా ఉన్నారు... పేరుకి ఉమెన్స్ లీగ్ అయినా కౌన్సిల్‌లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడం... బీసీసీఐలో ఉన్న పురుషాధిక్యానికి నిదర్శనం...

చూస్తుంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేది మహిళలు అయినా వారిని ఆడించేది, ఆటకు ఏర్పాట్లు చేసేది, ఆటలో నిర్ణయాలు తీసుకునేది, ఆటను వెనకుండి నడిపించేది... అంతా మగాళ్లేనని తెలుస్తోంది. ఇప్పటికైనా మహిళా క్రికెట్‌కి మంచి రోజులు వస్తాయని ఆశపడిన వాళ్లు, ఇదంతా చూసి... క్యాష్ రిచ్ లీగ్‌లోనూ ఉమెన్‌కి న్యాయం దక్కడం లేదని వాపోవడమే మిగిలింది... 

click me!