ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆసీస్ కెప్టెన్ల మోజు... కెప్టెన్సీ వాళ్లకి! వైస్ కెప్టెన్సీ మనోళ్లకు...

Published : Mar 02, 2023, 01:43 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొనే మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌పై అటు బీసీసీఐలో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌కి జనాలు వస్తారో లేదోననే అనుమానంతో చాలా తక్కువ రేట్లకే టికెట్లను విక్రయిస్తోంది బీసీసీఐ..

PREV
17
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆసీస్ కెప్టెన్ల మోజు... కెప్టెన్సీ వాళ్లకి! వైస్ కెప్టెన్సీ మనోళ్లకు...
WPL 2023

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు చూసేందుకు అమ్మాయిలకు, మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించిన బీసీసీఐ, రూ. 100, రూ. 400 రేట్లకు టికెట్లను విక్రయానికి పెట్టింది. ఇప్పటికే ఐదు ఫ్రాంఛైజీలు, తమ కెప్టెన్లను ప్రకటించాయి...

27
Image credit: Mumbai Indians

ముంబై ఇండియన్స్‌ జట్టుకి టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ చేయబోతుంటే, ఆర్‌సీబీకి స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మిగిలిన మూడు ఫ్రాంఛైజీలకు ఆస్ట్రేలియా ప్లేయర్లే కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు...
 

37

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్ మెగ్ లానింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి కెప్టెన్సీ చేయబోతుంటే, యూపీ వారియర్స్ టీమ్‌కి అలీసా హీలి, గుజరాత్ జెయింట్స్ టీమ్‌కి బెత్ మూనీ సారథిగా వ్యవహరించనుంది...

47

టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, యూపీ వారియర్స్ టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతోంది. జెమీమా రోడ్రిగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి వైస్ కెప్టెన్‌గా నియమించబడితే యంగ్ ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, గుజరాత్ జెయింట్స్‌కి ఉప సారథిగా ఎంపికైంది..
 

57

ఉమెన్స్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని డామినేషన్ చూపిస్తోంది. ఏడుసార్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరి, ఆరు సార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా... కామన్వెల్త్ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించింది..

67

పురుషుల ఐపీఎల్‌లో కూడా షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ వంటి ఆస్ట్రేలియా కెప్టెన్లు.. టైటిల్స్ గెలిచారు. అందుకే మన అమ్మాయిలకు ఇవ్వడం కంటే ఆస్ట్రేలియా ప్లేయర్లను కెప్టెన్లుగా ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి డబ్ల్యూపీఎల్ ఫ్రాంఛైజీలు..

77

హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా కెప్టెన్, స్మృతి మంధాన యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ ప్లేయర్ కాకపోయి ఉంటే... ఆ రెండు ఫ్రాంఛైజీలు కూడా మిగిలిన ఫ్రాంఛైజీల మాదిరిగానే ఆలోచించేవి. మరి మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్లు సక్సెస్ అవుతారా? లేక భారత కెప్టెన్లు సక్సెస్ సాధిస్తారా? అనేది చూడాలి.. 

click me!

Recommended Stories