జడ్డూ, నీ వల్లే ఈ పరిస్థితి! ఇన్ని నో బాల్స్ వేస్తావా... సునీల్ గవాస్కర్ ఫైర్...

Published : Mar 02, 2023, 12:57 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నలో 3 మ్యాచుల్లో 21 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు రవీంద్ర జడేజా. తొలి రెండు టెస్టుల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నాడు రవీంద్ర జడేజా...

PREV
15
జడ్డూ, నీ వల్లే ఈ పరిస్థితి! ఇన్ని నో బాల్స్ వేస్తావా... సునీల్ గవాస్కర్ ఫైర్...

ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, మార్నస్ లబుషేన్‌ని సున్నా దగ్గర క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అది నో బాల్‌గా తేలడంతో లబుషేన్ నాటౌట్‌గా నిలిచాడు. జడ్డూ వికెట్ తీయడం, తర్వాత అది నో బాల్‌గా తేలడం ఇదే మొదటిసారి కాదు. సిరీస్‌లో ఇప్పటికే 3 సార్లు ఇలా జరిగింది...
 

25
Jadeja

ఈ సిరీస్‌లో ఇప్పటికే ఐదు ఇన్నింగ్స్‌లో 9 నో బాల్స్ వేశాడు రవీంద్ర జడేజా. ‘నో బాల్ గురించి కచ్ఛితంగా మాట్లాడాలి. ప్రొఫెషనల్ క్రికెటర్‌ అయ్యాక ఇంత అనుభవం వచ్చాక లైన్ ఎక్కడుందో తెలియకుండా బౌలింగ్ చేయడం ఏంటి? ఫాస్ట్ బౌలర్లు నో బాల్స్ వేసినా అనుకోవచ్చు కానీ స్పిన్ బౌలర్ ఇన్ని నో బాల్స్ వేయడం కరెక్ట్ కాదు..

35
Image credit: PTI

అతను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఈ విషయం గురించి అడుగుతా? స్పిన్ బౌలర్‌కి బంతిపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. కనీసం నో బాల్స్ వేయకుండా బౌలింగ్ చేయగలడు. అయినా ఎందుకు ఇలా జరుగుతోంది. ఇన్ని నో బాల్స్ ఎందుకు వేస్తున్నాడు?... ’ అంటూ సీరియస్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

45
Image credit: PTI

‘స్పిన్ బౌలర్ కెరీర్‌లో 8-9 నో బాల్స్ ఉండడం సాధారణ విషయం కానీ ఒకే సిరీస్‌లో 9 నో బాల్స్ వేయడం మాత్రం దారుణం. రవీంద్ర జడేజా లాంటి సీనియర్ నుంచి ఇలాంటి బౌలింగ్ టీమ్‌కి మంచిది కాదు. నో బాల్‌కి వికెట్ పడితే అది టీమ్‌ని మరింత దెబ్బ తీస్తుంది...

55
Image credit: PTI

నో బాల్ వేయకపోయి ఉంటే లబుషేన్ డకౌట్ అయ్యేవాడు. అప్పుడు 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఉండేది ఆస్ట్రేలియా. వెంటవెంటనే మరో 2 వికెట్లు పడితే 20-25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఉండేది. అప్పుడు మ్యాచ్ పూర్తిగా భారత జట్టు చేతుల్లోకి వచ్చి ఉండేది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. 

click me!

Recommended Stories