బాబర్ ఆజమ్ ఏడి? వరల్డ్ కప్‌ ప్రోమోలో మా కెప్టెన్‌ని చూపించరా... ఐసీసీపై షోయబ్ అక్తర్ ఫైర్...

Published : Jul 23, 2023, 05:11 PM IST

ఐసీసీ విడుదల చేసిన మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రోమోలో ఇండియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇండియాలో జరగబోతున్నంత మాత్రం ప్రోమోలో ఎక్కువ భాగం టీమిండియా క్రికెటర్లే ఉండడంపై మిగిలిన దేశాల క్రికెట్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ టీమ్‌ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఈ ప్రోమోలో కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..

PREV
16
బాబర్ ఆజమ్ ఏడి? వరల్డ్ కప్‌ ప్రోమోలో మా కెప్టెన్‌ని చూపించరా... ఐసీసీపై షోయబ్ అక్తర్ ఫైర్...
Rohit Sharma-Babar Azam

బాలీవుడ్ షారుక్ ఖాన్‌ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023 ప్రోమోలో టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్‌తో పాటు శుబ్‌మన్ గిల్, మహిళా జట్టు క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా కనిపించారు..

26
World Cup Promo-Akthar

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు ముత్తయ్య మురళీధరన్, జాంటీ రోడ్స్‌తో పాటు అన్ని దేశాల టీమ్స్, జెర్సీలు కనిపించాయి. పాకిస్తాన్ టీమ్ నుంచి ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ మాత్రమే వికెట్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ క్లియర్‌గా కనిపించాడు. 

36

‘పాకిస్తాన్ క్రికెట్ టీమ్, బాబర్ ఆజమ్ లేకుండా వరల్డ్ కప్ ప్రోమో కంప్లీట్ ఎలా అవుతుంది. అదీకాకుండా బాబర్ ఆజమ్‌ని ఓ జోక్‌గా చూపించారు. కమ్ ఆన్ Guys, కాస్త ఎదగాల్సిన టైం వచ్చింది..’ అంటూ ట్వీట్ చేశాడు షోయబ్ అక్తర్..

46
Babar Azam

ఈ ప్రోమోలో 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ క్లీన్ బౌల్డ్ అయిన క్లిప్‌ని జోడించి.. పాక్ కెప్టెన్‌ని తీవ్రంగా అవమానించింది ఐసీసీ.. ఈ విధంగా బాబర్ ఆజమ్‌ని చూపించడాన్ని తప్పుబట్టాడు అక్తర్..

56
Babar Azam

ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో చాలా రోజులుగా టాప్‌లో కొనసాగుతున్న బాబర్ ఆజమ్‌ని వన్డే వరల్డ్ కప్ ప్రోమోలో ఈ విధంగా ప్రెజెంట్ చేయడంపై అతని ఫ్యాన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. 

66

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది...

click me!

Recommended Stories