Virat Kohli 500th Match
తొలి టెస్టులో 76 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో 121 పరుగులు చేసి కెరీర్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు యశస్వి జైస్వాల్..
Yashasvi Jaiswal
‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే నేను టీవీకి అతుక్కుపోతా. ఇప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఓ లెజెండ్. విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా గొప్ప అనుభవం..
ఆయనని చూస్తే ఎన్నో నేర్చుకున్నా, బ్యాటింగ్‌లోనే కాదు, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్.. విరాట్ చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో నవ్వుతూ మాట్లాడతారు. ఆయనతో మాట్లాడడం, ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా సరదాగా ఉంటుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు యశస్వి జైస్వాల్..
తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 121 పరుగులు చేసి, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా 76 అంతర్జాతీయ సెంచరీల మార్కు అందుకున్నాడు విరాట్ కోహ్లీ..
తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ చేసిన 121 పరుగుల్లో 11 బౌండరీలు ఉంటే 45 సింగిల్స్, 13 డబుల్స్ ఉండడం ఆయన ఎనర్జీకి నిదర్శనం. 206 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ రనౌట్ రూపంలోనే పెవిలియన్ చేరాడు.